పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదివరకు చేసినట్లుగా సినిమాలు స్లోగా చేయడం లేదు. వరుస సినిమాలతో ఒక్కో సినిమాను విడుదలకు రెడీ చేసేందుకు సన్నద్ధం అయ్యాడు. ఓవైపు వకీల్ సాబ్ విడుదలకు రెడీ అవుతుండగా.. మరోవైపు అయ్యప్పనుమ్ కోషియం, హరిహర వీరమల్లు సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే గుట్టుచప్పుడు కాకుండా అయ్యప్పనుమ్ షూటింగ్ నలభై శాతం పూర్తి చేశారట పవన్ కళ్యాణ్, రానా. అయితే ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మే వరకు కంప్లీట్ అవుతుందని టాక్.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇన్నేళ్ల సినీకెరీర్లో ఓ చారిత్రాత్మక చిత్రం చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా కొంతమేరకు పూర్తయినట్లు తెలుస్తుంది. రెండు సినిమాలను పవన్ బాలన్సింగ్ గా కంప్లీట్ చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మార్చ్ 27 నుండి పవన్ కళ్యాణ్ ఛార్మినార్ సెట్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాత ఏఎం రత్నం 'హరిహర వీరమల్లు' సినిమాకోసం చార్మినార్ సెట్ వేయించారట. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకోసం భారీస్థాయిలో సెట్ నిర్మాణం చేయలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇటీవలే విడుదల చేసిన పవర్ స్టార్ వీరమల్లు లుక్ ప్రోమో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. వీరమల్లు పాత్రలో పవన్ చాలాబాగా సూట్ అయ్యాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ట్రేడ్ వర్గాలలో మాత్రం వీరమల్లు బిజినెస్ పై రికార్డు స్థాయిలో నెంబర్స్ వినిపిస్తున్నాయని తెలుస్తుంది.