పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' చిత్రాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని బడా నిర్మాతలు దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని డబుల్ చేసేలా ఇప్పుడు ఈ 'వకీల్ సాబ్' సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ఓపెనింగే పవన్ కళ్యాణ్ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమనే చెప్పాలి. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారట.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ను మొదట మే 15న ఆ తరువాత మళ్లీ జూన్ లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ నెలాఖరు వరకు థియేటర్లు మూతపడే ఉంటే.. 'వకీల్ సాబ్'ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. థియేటర్లు వెంటనే తెరుచుకోకున్నా జూన్‌లో షూటింగులు మాత్రం కచ్చితంగా ప్రారంభం అవుతాయని.. మిగిలిన భాగం షూటింగ్ కి నెల రోజులు మాత్రమే సమయం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పవర్ స్టార్ ఈ సినిమాతో పాటు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా లైన్లో పెట్టాడు. పవర్ స్టార్ వరుస సినిమాలను ఓకే చేస్తుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని చెప్పవచ్చు.