బన్నీ కోసం బాహుబలి వస్తున్నాడంట

Update: 2018-04-11 12:29 GMT
అంతకుముందు సినిమాలకు రిలీజ్ ముందు ఎలాంటి ప్రొమోషన్స్ కార్యక్రమాలు ఉండేవి కాదు. కానీ సోషల్ మీడియా వృద్ధి చెందుతున్న సమయం నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఆఖరికి సక్సెస్ మీట్ అని జరుపుతున్నారు. గత కొంతకాలంగా ఒక హీరో సినిమా ఈవెంట్ కు మరొక హీరో వెళ్లడం ఒక ట్రెండ్ అయిపోయింది.

గౌతమి పుత్ర శాతకర్ని సినిమా ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. హీరోగా నటించను అని బై బై చెప్పేసి నితిన్ సినిమా సహా నిర్మాత కావడంతో ప్రోమోషన్ల కోసం తిరిగాడు. మహేష్ బాబు ఎంచక్కా భరత్ అనే నేను సినిమా ఈవెంట్ కోసం రామ్ చరణ్ - ఎన్టీఆర్ ను పిలిచాడు చెర్రీ కొద్దిగా బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం సరేనన్నాడు. ఇప్పుడు మరొక హీరో కూడా వేరే సినిమా ఈవెంట్లో దర్శనమివ్వబోతున్నాడు. అల్లు అర్జున్ మొదటి సారి ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న దేశ భక్తి సినిమా నా పేరు సూర్య మే 4న విడుదలకు సిద్దంగా ఉండగా ఈ నాల 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి రమ్మని ఒక పెద్ద స్టార్ హీరోని కోరారట.

అతను ఎవరో కాదు మన బాహుబలి ప్రభాస్. ప్రస్తుతం సాహో సినిమా షూటింగులతో బిజీగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ తనకు ప్రియ మిత్రుడు అయిన బన్నీ సినిమా ఫంక్షన్ కోసం సమయం కేటాయించి చీఫ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడట. ఆఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో రానుంది. బన్నీ - ప్రభాస్ మధ్య స్నేహం సినిమాలోకి రాకముందు నుండే కొనసాగుతోంది. ఈ మధ్య ప్రభాస్ కు హోమ్ ప్రొడక్షన్ లాంటి యూవి క్రియేషన్స్ కూడా గీత ఆర్ట్స్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు కనుక ఈ వార్తల్లో అబద్ధం లేదు అని ఫాన్స్ నమ్ముతున్నారు.
Tags:    

Similar News