తెలుగు సినిమాల్లో వారసుల హవా సాగుతోంది కొన్నేళ్లుగా. ఇంతకుముందు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు నిర్మాతలు - టెక్నీషియన్ల పిల్లలు కూడా హీరోలైపోతున్నారు. పెద్ద ఫ్యామిలీలతో లింకున్న బంధువర్గం నుంచి కూడా హీరోలు తయారవుతున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీలోనే ప్రస్తుతం తొమ్మిది మంది హీరోలున్నారంటే వారసుల హవా ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ఫ్యామిలీల్లో కూడా ఈ పరిస్థితే కనిపిస్తోంది.
ఈ కోవలోనే ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఓ కొత్త కథానాయకుడు వస్తున్నాడు. అతడి పేరు రవి వర్మ. ఇతను ప్రభాస్ కు కజిన్ అవుతాడు. చౌడప్ప అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. నిర్మాణ సంస్థ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రవివర్మలో కొంచెం ప్రభాస్ పోలికలు కూడా కనిపిస్తున్నాయి. లుక్స్ అవీ బాగానే ఉన్నాయి.
ఇప్పటికే ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. అతను కూడా ప్రభాస్ కజినే. పేరు సిద్దార్థ్. ‘కెరటం’ అనే సినిమాలో నటించాడతను. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. కానీ ఆ సినిమా వచ్చిన సంగతి పోయిన సంగతి తెలియదు. ఆ హీరో మళ్లీ కనిపించలేదు. మరి రవి వర్మ అయినా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి. ఎంట్రీ బాగా జరిగిందంటే చాలు.. ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు అతణ్ని ముందుకు తీసుకెళ్లిపోతార్లెండి.