సౌత్ హీరోలను ఒకప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు కనీసం గుర్తించే వారు కాదు. కాని ఇప్పుడు సౌత్ కు చెందిన పలువురు స్టార్స్ కు అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో అదే రేంజ్ లో ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు.. ఉంటారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఉత్తర భారతంలో ప్రభాస్ రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన్ను అభిమానించే అభిమానులు ఉన్నారు. అలాంటి ప్రభాస్ సినిమా అంటే అదే రేంజ్ లో ఉండాలి. బాహుబలి తర్వాత సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో చేసిన ప్రభాస్ ఇప్పుడు తన సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో చేస్తున్నాడు.
ఇప్పటికే నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రభాస్ తో చేయబోతున్న సినిమా పాన్ ఇండియా మూవీ కాదని.. ఖచ్చితంగా హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. మొదటి పాన్ వరల్డ్ మూవీ అంటూ ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అలాంటి సినిమా కోసం అభిమానులు.. భారత దేశ సినీ ప్రేమికులు ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఆదిపురుష్ కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ ను మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. రామాయణ ఇతివృత్తంను అత్యంత ఆధునికంగా చూపించడంతో పాటు హై టెక్నికల్ వ్యాల్యూస్ తో హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఆదిపురుష్ ఖచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ అవుతుందనే నమ్మకంను ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కూడా తక్కువేం కాదంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుంటా ఉంటాయని అంటున్నారు. తెలుగు లో భారీ ఎత్తున అంచనాలున్న సలార్ సినిమా ఇతర భాషల్లో కూడా ఖచ్చితంగా అటెన్షన్ ను క్రియేట్ చేస్తుందనే నమ్మకం కలుగుతోంది. కేజీఎఫ్ సినిమా తో సెన్షేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను మరో రేంజ్ లో అన్నట్లుగా రూపొందిస్తున్నాడు. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకం కూడా వ్యక్తం అవుతోంది. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సలార్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం ఖాయం.. పాన్ ఇండియా స్టార్ నుండి పాన్ వరల్డ్ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకోవడం కూడా ఖాయం అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు.