పూర్తిగా 'ప్రాజెక్ట్ K' కు అంకితం కాబోతున్న ప్రభాస్..!

Update: 2021-07-29 02:30 GMT
ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పటి వరకు 19 చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వచ్చే ఏడాది చివరి నాటికి మూడు సినిమాలను విడుదల చేయనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా కోసం తన కెరీర్ లోని ఐదేళ్ల సమయాన్ని కేటాయించారు ప్రభాస్. అంత రిస్క్ తీసుకుని డెడికేషన్ గా ఉన్నాడు కాబట్టే డార్లింగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారని చెప్పాలి.

'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్ క్లూజన్' తర్వాత ప్రభాస్ వీలైనంత త్వరగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కోవిడ్ వైరల్ లాంటి అడ్డంకులు లేకపోతే ప్రభాస్ నుంచి ఈపాటికే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలానే 'సలార్' మరియు 'ఆదిపురుష్' చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో '#Prabhas21' అనే వర్కింగ్ టైటిల్ తో అప్పుడెప్పుడో ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించాల్సిన సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే ప్రభాస్ లైనప్ లో ప్లేస్ మార్చుకుని ''ప్రాజెక్ట్ K'' గా వచ్చి చేరింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో అమితాబ్ పై కొన్ని సీన్స్ నని షూట్ చేస్తున్నారు.

ప్రభాస్ కూడా త్వరలోనే 'ప్రాజెక్ట్ కె' సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. దీని కోసం స్టార్ హీరో 200 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కావడం.. అందులోనూ భారీ స్థాయిలో రూపొందే సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ సినిమా అవడంతో షూటింగ్ కోసం ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ మూవీ కోసం అడిగినన్ని డేట్స్ అలాట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే 'బాహుబలి' తరువాత ప్రభాస్ ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు వర్క్ చేసిన చిత్రం ఇదే అవుతుంది.

'సలార్' 'ఆది పురుష్' సినిమాలు పూర్తి చేసిన తర్వాత కంప్లీట్ గా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' చిత్రానికే అంకితం కానున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ - టాప్ నాచ్ టెక్నిషియన్స్ ఇందులో భాగం కానున్నారు. త్వరలోనే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇకపోతే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇంకో పది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోచేస్తున్న 'సలార్'.. ఓం రౌత్ తో కలిసి 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు. వీటిలో ఒకటి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల ప్లాన్ చేయగా.. మరొకటి 2022 ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News