చూడటానికి ప్రభాస్ చాలా రఫ్ గా కనిపిస్తాడుగానీ .. ఆయన మనసు చాలా సున్నితమనే విషయం చాలామందికి తెలుసు. ప్రభాస్ సినిమాలు మాత్రమే కాదు .. ఆయన వ్యక్తిత్వం కూడా ఆయన అభిమానుల సంఖ్యను పెంచడానికి కారణమైందని చెప్పుకుంటూ ఉంటారు.
తన ఎదురుగా ఎవరూ కష్టపడటం ప్రభాస్ చూడలేరనీ, ఎవరూ బాధపడినా ఆయన తట్టుకోలేరని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పాడు. ఇక తనతో ఎవరు ఉంటే వారికి తనతో సమానమైన గౌరవ మర్యాదలు దక్కేలా చూడటం ఆయన ప్రత్యేకత అని కూడా అన్నాడు.
ఇండియాలో ప్రభాస్ కి ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతాకాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. అయినా సెట్లో ప్రభాస్ సింపుల్ గానే ఉంటాడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. అందువల్లనే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లంతా ఆయన మంచితనం గురించి చెబుతుంటారు. ఇక తనకి ఆప్తులైనవారు ఎవరైనా దూరమైతే ఆయన ఎంతమాత్రం తట్టుకోలేడు. ఎక్కడ ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా ఆయన కదిలిపోతుంటాడు. కోట్ల రూపాయల్లో ఆయన అందించిన సాయమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అంత సున్నితమైన మనసు ఉండటం వల్లనే, పునీత్ రాజ్ కుమార్ టీజర్ ను చూడగానే ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి ముందు చేసిన సినిమా 'జేమ్స్'. ఈ సినిమాలో పునీత్ పాత్రకి ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పునీత్ పోస్టర్ ను ఎమోషనల్ నోట్ తో ప్రభాస్ పంచుకున్నాడు.
'జేమ్స్' రూపంలో మేము ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. పునీత్ సార్ ను అభిమానించే లక్షలాది మందికి ఈ సినిమా ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సార్ .. మిమ్మల్ని మిస్సవుతున్నాము" అంటూ రాసుకొచ్చాడు. ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ కుమార్ వారసుడైన పునీత్ రాజ్ కుమార్ అహంభావానికి సాధ్యమైనంత దూరంగా ఉండేవారు. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులున్నప్పటికీ సామాన్యులతో కలిసిపోయేవారు.
సాధారణంగా ఈ కాలంలో ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు వెళుతుండటం కనిపిస్తుంది. ఒకరిని ఒకరు పలకరించలేనంత బిజీ. అయినా పునీత్ ఎప్పుడూ కూడా స్నేహితులకు సాధ్యమైనంత దగ్గరగా ఉండటానికే ప్రయత్నించేవారు. కన్నడ చిత్రపరిశ్రమను ఇతర భాషలకు మరింత చేరువ చేయడంలో ఆయన పరిచయాలు .. స్నేహాలు కూడా కీలకమైన పాత్రను పోషించాయని చెప్పుకుంటూ ఉంటారు. అందువల్లనే ఆయన మరణం టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఈ స్థాయిలో కదిలించిందని చెప్పచ్చు.