ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాలు ప్రభాస్ 'బాహుబలి' చిత్రం కోసం కష్టపడ్డాడు. ప్రభాస్ కష్టంకు పది రెట్ల ప్రతిఫలం అయితే దక్కింది. బాహుబలి చిత్రంలో నటించినన్ని రోజులు కూడా దాదాపుగా 90 కేజీల బరువును ప్రభాస్ మెయింటెన్ చేయడం జరిగింది. బాహుబలి చిత్రం కోసం బాడీ పెంచిన ప్రభాస్ 'సాహో' కోసం తగ్గించాడు. బాహుబలి విడుదలైన తర్వాత సాహో చిత్రీకరణ మొదలు పెట్టడంకు చాలా టైం తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రభాస్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డాడట.
'సాహో' చిత్రం కోసం ప్రభాస్ దాదాపుగా 20 కేజీల వరకు బరువు తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి చిత్రం తర్వాత సాహో కోసం బరువు తగ్గేందుకు 5 నెలలు పూర్తి వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తిన్నాను. బాహుబలి సమయంలో పూర్తిగా నాన్ వెజ్ తినగా సాహో కోసం అయిదు నెలలు నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా డైట్ ఫాలో అయ్యాను. రోజులో ఎక్కువ సమయం వర్కౌట్స్ చేయడంతో పాటు డైట్ ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గినట్లుగా చెప్పుకొచ్చాడు.
నేను వెజిటేరియన్ గా మారి పోవడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడ్డారంటూ నవ్వుతూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. వెజిటేరియన్ మాత్రమే తినడం వల్ల మంచి ఫలితం అయితే దక్కిందని ప్రభాస్ అన్నాడు. సాహో చిత్రం కోసం చాలా కష్టపడ్డామని ఆ కష్టం సినిమాలో కనిపిస్తుందని ప్రభాస్ అన్నాడు. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్ ఉపయోగించకుండా సహజంగా సీన్స్ ఉండేలా చాలా రిస్క్ లు చేశామని ప్రభాస్ అన్నాడు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వంశీ మరియు ప్రమోద్ లు ఈ చిత్రంను నిర్మించారు.