అయ్యో పాపం పెళ్లికి టైమే లేదే!!

Update: 2015-10-15 16:22 GMT
బెండ ముదిరి నా బ్ర‌హ్మ‌చారి ముదిరినా .. అని ఓ సామెత‌. మ‌రీ 30 ప్ల‌స్ వ‌ర‌కూ వేచి చూస్తే వ్య‌క్తిగ‌త జీవితం లో కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అనుభ‌వ‌జ్ఞులు అనుభ‌వంతో చెబుతుంటారు. అందుకే ఇటీవ‌లి కాలంలో మ‌న టాలీవుడ్ బ్ర‌హ్మ‌చారులంతా పెళ్లి బంధంతో సంసార జీవ‌నంలో కి అడుగుపెట్టేస్తున్నారు. అల్ల‌రి న‌రేస్‌, మంచు మ‌నోజ్ ఆ విధంగానే దీపం ఉండ‌గా చ‌క్క‌దిద్దుకున్నారు. మ‌రి టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ ప‌రిస్థితేంటి? అస‌లు పెళ్లి చేసుకుంటాడా?  చేసుకోడా? ఆ మాట అడిగితే స‌మాధానం దాట‌వేస్తాడెందుకు?

అప్ప‌ట్లో ఇంట్లో వాళ్లంతా కంగారు ప‌డుతున్నారు, పైగా త‌న‌ని కంగారు పెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే పిల్ల‌ని వెతుకుతున్నారు అని వార్త‌లొచ్చాయి. అనూహ్యంగా ప్ర‌భాస్ జీవితంలోకి బాహుబ‌లి ఆఫ‌ర్ ప్ర‌వేశించింది. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌క్క‌న్న‌తో క‌లిసి కాపురం చేసిన ప్ర‌భాస్ ఇక లైఫ్ పార్ట‌న‌ర్ గొడ‌వే మ‌ర్చిపోయాడు. స‌రే బాహుబ‌లి రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన శుభ‌వేళ ఎవ‌రైనా పారిశ్రామిక వేత్త కూతురినో, రాజ‌కీయ నేత డాట‌ర్‌నో వ‌ల‌చి వివాహం ఆడేస్తాడ‌ని అనుకుంటే అదీ జ‌ర‌గలేదు. ఇక కాదు కూడ‌దు ఈ డిసెంబ‌ర్‌ లోనే పెళ్లి అంటూ ఇటీవ‌లి కాలంలో ప్ర‌చార‌మైనా ఇప్పుడు అది కూడా వాయిదా ప‌డింద‌ని ప్ర‌భాస్‌ కి అత్యంత స‌న్నిహితులు చెబుతున్నారు.

అస‌లే జ‌క్క‌న్న బాహుబ‌లి 2 చిత్రాన్ని జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్రాజెక్టు గా మార్చేస్తున్నాడు. అంటే ఆ భారం అంతా ఇంతా కాదు. అందుకే ఇప్ప‌టినుంచి స‌రైన క‌స‌ర‌త్తులు చేసి త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని ప్ర‌భాస్ ఫిక్స‌య్యాడుట‌. అంటే ఈ ఏడాది కూడా పెళ్లి లేన‌ట్టే. క‌నీసం వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలోనైనా ఉంటుందా? అంటే ముందు బాహుబ‌లి 2 రిలీజై హిట్ కొట్టాలి క‌దా! అంటున్నారు. అంటే ఇక 2017 ద్వితీయార్థంలో ఆ శుభ‌ఘ‌డియ ఉంటుంద‌నిఅనుకోవ‌చ్చంటున్నారు. అదీ సంగ‌తి.
Tags:    

Similar News