ప్రభాస్... జోరు పెంచాల్సిందే... ?

Update: 2021-12-14 00:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోరు పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ప్రభాస్ బాహుబలి వన్ టూ మూవీస్ తో బాలీవుడ్ లో జెండా పాతేశారు. అది సాహో మూవీ రిలీజ్ తో ప్రూవ్ అయింది. సాహో మూవీ టాలీవుడ్ లో ఫట్ అయితే బాలీవుడ్ లో హిట్ అయి వంద కోట్ల పైబడి కలెక్షన్లు కొల్లగొట్టింది. అదే ఊపులో ప్రభాస్ మరో రెండు సినిమాలు రిలీజ్ చేసి ఉంటే ఈపాటికి ప్రభాస్ ముంబై షిఫ్ట్ అయిపోయి ఉండేవారు.

ప్రభాస్ కూడా అలాగే చేద్దామని అనుకున్నారు. కానీ కరోనా రెండు దశలతో ఆయన తరువాత మూవీ ఆలస్యం అయింది. మొత్తానికి రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. డేట్ కూడా లాక్ చేశారు. జనవరి 14 న గ్రాండియర్ గా ఈ  మూవీ దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ మూవీ కోసం మొదట అనుకున్న బడ్జెట్  రెండు కరోనాల కారణంగా బాగా దాటేసింది. ఏకంగా 250 కోట్ల మేర ఖర్చు అయింది అని టాక్. ఏమైనా పాన్ ఇండియా మూవీ కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే ఇంతకు రెట్టింపు వసూళ్ళు ఖాయం. అయితే కచ్చితంగా నెల రోజులు మాత్రమే టైమ్ ఉండగా రాధేశ్యామ్  ప్రమోషన్స్ అయితే ఎక్కడా పెద్దగా కనిపించడంలేదు అంటున్నారు.

ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన సాంగ్స్ లో ఒకటి మత్రమే బాలీవుడ్ ని పట్టుకుంది. ఇక బాలీవుడ్ లో రాధే శ్యామ్ కి అనుకున్న హైప్ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడంలేదు అంటున్నారు. ఇక సంక్రాంతి వేళ  ఈ క్యూట్ లవ్ స్టోరీ అది కూడా పాన్ ఇండియా లెవెల్ హీరోగా ప్రభాస్ ఎదిగిన టైమ్ లో చేస్తున్న కూల్ స్టోరీ అంటే ఎంతవరకూ రీచ్ అవుతుంది అన్న చర్చ ఉండనే ఉంది.

ఇక టాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ మాస్ రచ్చ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటి టైమ్ లో రాధేశ్యామ్ లవ్ స్టోరీ అంటే ఎక్కితే ఓకే కానీ లేకపోతే ఎలా అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఇంకోవైపు చూసుకుంటే బాలీవుడ్ లో పాస్ అయితేనే రాధేశ్యామ్ గట్టెక్కుతుంది అంటున్నారు.

ఒక వైపు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ హోరు పెద్ద ఎత్తున సాగుతోంది. రాజమౌళి ఇలాంటి విషయాల్లో ఎక్స్ పెర్ట్. ఆయన ఇంకా దూకుడు పెంచనున్నారు. మరి దానికి ధీటుగా రాధేశ్యామ్ ప్రమోషన్ వర్క్ ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు. రెండూ పాన్ ఇండియా సినిమాలు. పైగా రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన  బాహుబలి సునామీ తరువాత విడిగా ఈసారి వస్తున్నారు. దాంతో ఎవరి స్టామినా ఏంటో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మరి రాధేశ్యామ్ మీద అంచనాలు పెంచడంలోనే మూవీ బ్లాక్ బస్టర్ జాతకం ఆధారపడి ఉంది అంటున్నారు.
Tags:    

Similar News