యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో వారం రోజుల్లో రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాధేశ్యామ్ సినిమా కోసం మూడు నాలుగు ఏళ్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్క అభిమాని కూడా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అంటూ జరగుతున్న ప్రచారం పై క్లారిటీ కోరుకుంటున్నారు.
మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యిందట. ముగ్గురు హీరోయిన్స్ మరియు ఇతర నటీ నటులు ఇంకా సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరు కూడా సెట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు,
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముంగిట ఉంది. ఈ సమయంలో మరో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే ఫోకస్ మారి పోయే అవకాశం ఉంది.. రాధేశ్యామ్ సినిమా బజ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మేకర్స్ భావిస్తున్నారట. అందుకే రాధేశ్యామ్ విడుదల అయిన ఒకటి రెండు వారాల్లోనే రాజా డీలక్స్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని విశ్వసనీయ సమాచారం అందుతోంది.
రాజా డీలక్స్ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కేవలం రెండు నెలల డేట్లు కేటాయించబోతున్నాడు. ఆ రెండు నెలల్లోనే ప్రభాస్ సింపుల్ గా సినిమాను చక్క బెట్టేయబోతున్నాడు. మారుతి చెప్పిన కథ ఎంతగా నచ్చితే ప్రభాస్ ఇంత స్పీడ్ గా డేట్లు కేటాయిస్తాడో అర్థం చేసుకోవచ్చు. దానయ్య కు గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభాస్ ఈ సినిమా ను చేసేందుకు గాను ముందుకు వచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ మరియు మారుతి కాంబోలో మూవీ అంటే అస్సలు సింక్ అవ్వడం లేదు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ప్రభాస్ ను భారీ సినిమాల్లో చూసి బోర్ కొట్టింది.. మారుతి ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో చూపిస్తే బాగుండు అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మారుతి తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కించే లా రాజా డీలక్స్ ను తెరకెక్కిస్తాడట. అంతే కాకుండా ఇది పాన్ ఇండియా సినిమా అని కూడా అంటున్నారు.
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు వచ్చేలా ఈ సినిమా ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా గాలి వార్తలే అవుతాయి. ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.