ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో మరి?

Update: 2019-08-14 04:56 GMT
ఇంకో 18 రోజుల్లో సందడి చేయబోతున్న సాహో కోసం అభిమానులు ప్రేక్షకులు థియేటర్లు ఇలా ఎవరికి వారు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా తెలుగు తెరమీదే కాదు ఇండియన్ స్క్రీన్ పైనే చూడని అతి పెద్ద యాక్షన్ ఫెస్టివల్ గా దీన్ని ప్రమోట్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ వ్యూస్ లో రికార్డులు సృష్టిస్తుండగా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతూ బాహుబలికి టార్గెట్ పెట్టిందని న్యూస్.

ఇదిలా ఉండగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సాహోకు ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడా అనే సందేహం మీడియాలోనే కాదు సామాన్యుల్లో కూడా ఉంది. దీని ప్రస్తావన ఓ ఇంటర్వ్యూలో వచ్చింది కూడా. అయితే ప్రభాస్ చాలా తెలివిగా దాటవేసే ప్రయత్నం చెయ్యడం గమనార్హం.

సాహోకు సంబంధించి పారితోషికం ఎంతనే దాని గురించి తాను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని బ్యానర్ తన స్నేహితులదే కాబట్టి అవన్నీ తర్వాత మాట్లాడుకుంటామని చెప్పాడు. ఇది నిజంగా నమ్మే విషయమేనా అని ఫిలిం నగర్ బాత్.

వినిపిస్తున్న టాక్ ప్రకారం జరిగే బిజినెస్ లో 50 శాతం డార్లింగ్ కు ఇచ్చేలా షూటింగ్ ముందే ఒప్పందం చేసుకున్నారట. ఒకవేళ అదే నిజమైతే ఆ ఫిగర్ ని ఇప్పటిదాకా ఏ హీరో తీసుకోలేదని  చెప్పొచ్చు. ఎంత స్నేహమైనా సినిమా వ్యవహారాల్లో దాన్ని లింక్ చేయడం కష్టం కాబట్టి పైకి ఏది చెబుతున్నా లోపల మాత్రం అగ్రిమెంట్ ముందే జరిగిందని అంటున్నారు. ఇది నిజమో కాదో పక్కన పెడితే తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి తర్వాత అతి తక్కువ టైంలోనే మరో సినిమా సాహో చేయడం కన్నా ప్రభాస్ కు కావాల్సింది ఏముంది



Tags:    

Similar News