ప్రభాస్ `భుం` ఒణికిస్తోంది. భుం భుం భుం! అంటూ అంతర్జాలంలో భూకంపం పుట్టిస్తోంది. కోటి.. 2కోట్లు.. 3కోట్లు.. అనంతం అన్న తీరుగా భుం భుం అంటూ దూసుకుపోతోంది మేకింగ్ వీడియో. `షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2` మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా వర్కవుటైంది. ముందే ఊహించినట్టే `సాహో` ప్రీరిలీజ్ బిజినెస్ కి ఇది పెద్ద రేంజులో కలిసొచ్చింది. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 రిలీజైన తర్వాత హిందీ శాటిలైట్ .. రిలీజ్ హక్కులకు వర్కవుటైనట్టే.. ఈసారి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 రిలీజయ్యాక ఓవర్సీస్ హక్కులకు వరం అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం... సాహో ఓవర్సీస్ హక్కుల్ని దుబాయ్ కి చెందిన ప్రఖ్యాత ఫార్స్ ఫిలింస్ సంస్థ కొనుక్కుంది. ఈ డీల్ రూ.42 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య సాగిందని తెలుస్తోంది. చైనా మినహా అన్నిచోట్లా ఈ సంస్థ రిలీజ్ చేస్తుందట. ఇంతకీ ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నామధేయం ఏమిటి? అంటే.. అహ్మద్ గోల్ చిన్. దుబాయ్ కేసనోవాల నుంచి చైనా ఓవర్సీస్ వరకూ ప్రతిదీ అనుభవం ఉన్న సినిమా పంపిణీదారుడు అని తెలుస్తోంది. విదేశాల్లో `కాయ్ రాజా కాయ్!` తరహాలో గొప్ప కమ్యూనికేషన్ ఉన్న దిగ్గజం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ `2.ఓ` చిత్రాన్ని రిలీజ్ చేసింది ఈ దిగ్గజ సంస్థనే. సదరు సంస్థ `సాహో` హక్కుల్ని చేజిక్కించుకోవడం సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. సాహో చిత్రంలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని దుబాయ్, యుఏఈలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కెన్నీ బేట్స్ సారథ్యంలోని యాక్షన్ ఎపిసోడ్స్ నభూతోనభవిష్యతి అన్న తీరుగా తెరకెక్కించారని ప్రచారమైంది. ఈ మేకింగ్ కి సంబంధించిన చాలా సంగతుల్ని సాహో షేడ్స్ 1 - 2 వీడియోల్లో స్పష్టంగా రివీల్ చేసింది యూనిట్. సరిగ్గా ఇదే పాయింట్ బిజినెస్ వర్కవుటవ్వడానికి కారణమైందని విశ్లేషించవచ్చు. దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తోంది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షేడ్స్ 2లో కథానాయిక శ్రద్ధా కపూర్ యాక్షన్ ఫీట్స్ యువతరం గుండెల్ని టచ్ చేసిన సంగతి విదితమే.