సాహో.. అప్పుడే 120 కోట్ల బిజినెస్?

Update: 2018-04-13 06:32 GMT
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఎలా కనిపిస్తాడా అని ఒక్క తెలుగు ప్రేక్షకులే ఎదురుచూడటం లేదు. నార్త్ వెస్ట్ ఈస్ట్ ఇలా అన్ని దిక్కుల్లో ఉన్న సినీ ప్రేక్షకులు సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో స్ట్రాంగ్ మ్యాటర్ లేనిదే యూవీ క్రియేషన్స్ అంత పెద్ద ప్రయోగం చేయదు అని చెప్పవచ్చు. సాహో సినిమా మీద నమ్మకం ఉంచి ప్రభాస్ రేంజ్ కి తగ్గటుగా నిర్మిస్తున్నారు.

దీంతో హిందీ డబ్బింగ్ హక్కులపై కొన్ని బడా ప్రొడక్షన్ సంస్థలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఎంత రేట్ అయినా పరవాలేదు అని సాహో తో బిజినెస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ సినిమాకు భారీ ఎమౌంట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల అఫర్ తో సాహో హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోనున్నాయట.
 
రీసెంట్ గా యూవీ ఆ విషయంపై చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఒక తెలుగు సినిమా హక్కులు ఈ రేంజ్ లో ఎప్పుడు సేల్ అవ్వలేదు. ఇక దర్శకుడు సుజీత్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సినిమా సన్నివేశాలు అనుకున్నట్లు వచ్చే వరకు తగ్గడంలేదట. బడ్జెట్ కూడా 150కోట్లకు మించి కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలతోనే హైప్ క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  
Tags:    

Similar News