ప్రభాస్ అలా సింపుల్ గా కానిచ్చేశాడు

Update: 2017-03-26 18:03 GMT
అందరూ చాంతాడంత లెంగ్త్ స్పీచులు ఇచ్చినా కూడా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం 10 గంటలకే పోలీసులు కార్యక్రమాన్ని ముగించేయమన్నారు అనే నిబంధనను గుర్తుచేస్తూ.. ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా మాట్లాడేశాడు. బాహుబలిః ది కంక్లూజన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సమాయాభావం కారణంగా అసలు కండలవీరుడు ప్రభాస్ ఎక్కువగా మాట్లాడిందే లేదు. కాని ఆ రెండు మూడు మాటలు కూడా చాలా గొప్పగానే చెప్పాడులే.

''రెండు సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం వెయిట్ చేసినందుకు డాళింగ్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక నుండి సంవత్సరానికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ గొప్ప ప్రొడ్యూసర్లకు.. టెక్నీషియన్లకు అందరికీ థ్యాంక్స్'' అంటూ రెండు లైన్లు చెప్పేసి ముగించాడు ప్రభాస్. అలాగే హిందీలో సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన కరణ్‌ జోహార్ ను తొలుత అందరూ మర్చిపోయారు కాని.. ప్రభాస్ మాత్రం ఆయనకు చివర్లో థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు రాజమౌళి కూడా థ్యాంక్స్ చెప్పాడులే.

ఇకపోతే అభిమానుల కోసం ట్రైలర్లో ఉన్న.. ''నువ్వు పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడే లేడు మామా'' అనే డైలాగునూ.. ''వాడిది తప్పని తేలింది.. తల తెగింది'' అనే డైలాగ్ ను కూడా చెప్పాడు. ఇక్కడ ఇంత సింపుల్ గా కానిచ్చేసిన ప్రభాస్.. ఇక మీడియా ఇంటర్యూల్లో ఎలా ఇరగదీస్తాడో చూడాలి. ఏప్రియల్ 28న బాహుబలిః ది కంక్లూజన్ రిలీజ్ అవుతోంది.
Tags:    

Similar News