ఈ మధ్య తెగ కనిపించేస్తున్నా-ప్రభాస్

Update: 2015-12-20 04:47 GMT
‘బాహుబలి’ పనిలో పడి దాదాపు రెండేళ్లు బయటెక్కడా కనిపించలేదు ప్రభాస్. కానీ ఆ సినిమా విడుదలయ్యాక ఎక్కడ చూసినా ప్రభాసే. అందులోనూ ఈ మధ్య వరుసగా ఆడియో ఫంక్షన్లకు హాజరవుతూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. లోఫర్ - ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో ఫంక్షన్లకు అతనే ముఖ్య అతిథి. తను నేను - భలే మంచి రోజు లాంటి చిన్న సినిమాల్ని కూడా ప్రమోట్ చేశాడు. ప్రభాస్ ను ఇలా అందరూ వాడేసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు.

ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో ఫంక్షన్లో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘నేను మామూలుగా పెద్దగా బయటికి రాను. కానీ ఈ మధ్య చాలాచోట్ల తెగ కనిపించేస్తున్నా. బాహుబలి-2 షూటింగ్ మొదలయ్యే లోపు ఇలా ఫంక్షన్లకు వస్తున్నా. ఎక్స్ ప్రెస్ రాజా డైరెక్టర్ మేర్లపాక గాంధీ గురించి వంశీ - ప్రమోద్ చెబుతుంటే చాలాసార్లు విన్నా. క్లారిటీ ఉన్న డైరెక్టర్ అని.. ఒక్క షాట్ కూడా అదనంగా తీయడని.. పక్కా ప్లానింగ్ తో ఉంటాడని చెప్పారు. ఎడిటర్ కూడా కట్ చేయడానికి ఎక్స్ ట్రాగా ఏమీ లేదని అన్నాడు. యువి క్రియేషన్స్ మన బేనర్. శర్వా మన హీరో. ఇంతకుముందు ఈ బేనర్ లో వచ్చిన సినిమాల్ని పెద్ద హిట్ చేశారు. ఎక్స్ ప్రెస్ రాజా కూడా అలాగే విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా’’ అని ముగించాడు ప్రభాస్.
Tags:    

Similar News