ప్రస్తుతం సెట్స్ పైన ఉండే అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో రాజమౌళి 'RRR' ఒకటి. ఈ సినిమా జులై 30 న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఈ సినిమా డిలే అయ్యేలా ఉందని అంటున్నారు. 'RRR' ను జులై నుంచి అక్టోబర్ కు వాయిదా వేసే అలోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమా కనుక అక్టోబర్ లో రిలీజ్ చేస్తే మాత్రం ప్రభాస్ సినిమాకు పోటీ తప్పదని అంటున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్20 నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభమైంది. వచ్చే నెలలో ఆస్ట్రియాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే దసరా సీజన్ లో #ప్రభాస్20 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇదే సీజన్ లో కనుక 'RRR' రిలీజ్ ప్లాన్ చేస్తే భారీ పోటీ తప్పదు. నిజానికి రాజమౌళి సినిమాతో ఇతర సినిమాలేవీ పోటీపడలేవు. రాజమౌళి.. ప్రభాస్ లు ఇద్దరూ క్లోజ్ కాబట్టి ఇలా పోటీ పడే అవకాశం దాదాపుగా లేదు. అక్టోబర్ నెలలో నిజంగా రిలీజ్ ప్లాన్ చేస్తే మాత్రం కనీసం రెండు వారాలు గ్యాప్ అయినా ఇస్తారని అంటున్నారు.
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి' ఫ్రాంచైజీతో రాజమౌళి దేశంలోనే క్రేజీ డైరెక్టర్ గా మారిపోగా.. ప్రభాస్ కు హిందీ బెల్ట్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరి సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కావడం అంటే ఆసక్తికరమైన అంశమే. నిజంగా ఇలా జరుగుతుందా లేదా ఇవన్నీ ఊహాగానాలేనా అనేది వేచి చూడాలి.