#ప్ర‌భాస్ 23.. పారితోషికాలే స‌గం బ‌డ్జెట్ అంటే ..!

Update: 2021-05-30 14:30 GMT
రోబో - 2.0 త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి అధునాత‌న సాంకేతిక‌త‌తో మ‌రో భారీ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం సాగుతోందా? అంటే అవున‌నే నాగ్ అశ్విన్ క్లూ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంగా మారుతున్న ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ ని అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఆయ‌న తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నార‌ని లీకులందుతున్నాయి. దీనికోసం భారీ వీఎఫ్ ఎక్స్ సాంకేతిక‌త అవ‌స‌రం. అందుకే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌ను బ‌రిలో దించుతున్నారు.

వీఎఫ్ ఎక్స్ కోస‌మే బ‌డ్జెట్లో మెజారిటీ భాగం ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇంత‌కుముందు దాదాపు 250-300 కోట్ల మేర బ‌డ్జెట్ ని ఈ మూవీ కోసం కేటాయించార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ స్టార్ ప‌వ‌ర్ ప‌రంగా స్పాన్ పెర‌గ‌డంతో 350 కోట్ల వ‌ర‌కూ వెచ్చించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో స‌గం పైగా పారితోషికాల‌కే ఖ‌ర్చు చేయ‌నున్నార‌న్న గుస‌గుస‌లు తెర‌పైకొచ్చాయి. ఇక ఈ మూవీకి పెట్టే బ‌డ్జెట్ లో 100 కోట్లు కేవ‌లం ప్ర‌భాస్ ఖాతాలోకే ప‌డిపోతుంటే.. మ‌రో 70కోట్లు ఇత‌ర స్టార్ల‌కు ఖ‌ర్చయ్యేందుకు ఆస్కారం ఉంద‌ని స‌మాచారం.

దీపిక ప‌దుకొనే.. అమితాబ్ తో పాటు మ‌రో 8 మంది బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించేందుకు స్కోప్ ఉందిట‌. దీపిక‌కు అమితాబ్ కు చెప్పుకోద‌గ్గ పారితోషికం ముట్ట‌జెప్పాల్సి ఉంటుంది. ఇత‌ర పెద్ద స్టార్ల‌కు భారీ పారితోషికాల్ని చెల్లించాల్సి ఉంది. భవిష్యత్తు కాలం మారుతున్న‌ టెక్నాల‌జీతో అనుసంధానంపైనా.. హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాతో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. అయితే నాగ్ అశ్విన్ ఎలాంటి ప్ర‌యోగం చేసినా కానీ నేటిత‌రంతో పాటు ఓల్డ్ జ‌న‌రేష‌న్ కి సామాన్యుల‌కు మాస్ కు అర్థ‌మ‌య్యే ప్ర‌యోగం చేస్తార‌నే ఆశిద్దాం.


Tags:    

Similar News