`మా` ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. గత ఎన్నికలని మించి రసవత్తర మలుపులు తిరుగుతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న రెండు ప్యానెల్ లు ఇప్పటికే నామినేషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అధ్యక్ష పదవికి తాను పోటీకి దిగుతున్నానంటూ `సినిమా `మా` బిడ్డల ప్యానెల్ పేరుతో ప్రకాష్ రాజ్ ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే.
ఆ తరువాత మంచు విష్ణు తాను కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నానంటూ ప్రకటించారు. అయితే తన ప్యానెల్ ని మాత్రం చాలా ఆలస్యంగా ప్రకటించారు. తాను కూడా ఇటీవలే తన ప్యానెల్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల తేదీ కూడా ప్రకటించడంతో `మా` ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కింది. ప్రచారం మొదలు కావడంతో అందరి దృష్టి `మా` ఎన్నికలపై కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తన ప్యానెల్ నుంచి పోటీ చేస్తునక్న సభ్యుల ఫొటోలకు సంబంధించిన పాంప్లెట్ ని షేర్ చేస్తూ `#MaaElections2021 your VOTE is your VOICE..` `మా` హితమే మా అభిమతం... మనస్సాక్షిగా ఓటేద్దాం.. `మా` ఆశయాలను గెలిపిద్దాం.. అని ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్. `మా` హితమే మా అభిమతం... మనస్సాక్షిగా ఓటేద్దాం.. అని ప్రకాష్‌రాజ్ మరీ ట్రెస్ చేసి చెప్పడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
`మా` హితం అంటే ఏమిటీ? ఆయనను ఇప్పటికే నాన్ లోకల్ ఆర్టిస్టు మేలు చేస్తాడా? అంటూ మంచు విష్ణు తరపున వీకే నరేష్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యర్థులు వస్తే మా అసోసియేషన్ కి మేలు జరగదని ప్రకాష్ రాజ్ అంటున్నారు.
అయితే ఇప్పటికే రెండు ప్యానల్స్ ఇప్పటికే తమ మ్యానిఫెస్టోని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏమేమి చేస్తామో క్లియర్ చెబుతూ తమ ఎజెండాని సభ్యుల ముందుకు తీసుకెళ్తున్నారు. ఓటర్లని ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరికి వారు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మద్దతుదారుడు..మాజీ `మా` అధ్యక్షుడు వి. కె నరేష్ ..ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. దానికి కౌంటర్ గా `మా` హితవు అని ప్రకాష్ రాజ్ అంటున్నారా? అంటూ గుసగుస వినిపిస్తోంది.
సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద పీట వేస్తాం. విద్య..ఆరోగ్యంపై ప్రత్యేకంగా పనిచేస్తాం. మా టార్గెట్ వెల్ ఫేర్ అని క్లియర్ గా ఇరు వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ``ప్రకాష్ రాజ్ గార్ని డైరెక్ట్ గా ఓ మాట అడుగుతున్నా. దీనికి మీరు సమాధానం చెప్పండి. ప్రకాష్ రాజు గారు మీరు ఎప్పుడైనా ఈ 25 ఏళ్లలో వచ్చి `మా`కు ఓటు వేసారా? ఎన్నోసార్లు జనరల్ బాడీ మీటింగ్ లు జరిగాయి. ఎప్పుడైనా ఏ సమావేశంలోనైనా పాల్గొన్నారా? మీరు సస్పెండ్ అయ్యారా? లేదా? ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు?`` అంటూ ప్రత్యర్థి వర్గం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. మరి వీటన్నిటికీ ప్రకాష్ రాజ్ ఆర్టిస్టులకు సమాధానాలిచ్చారా లేదా? చూడాలి. మా రసవత్తర పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో ఇప్పటికి సస్పెన్స్.
ప్రకాష్ రాజ్ పై నరేష్ అసహనం
నిన్నటిరోజున ఓ సమావేశంలో ప్రకాష్ రాజ్ పై నరేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ... మా మెంబర్ల పుట్టిన రోజులకు ఎప్పుడైనా ఫోన్ చేసి విష్ చేసారా? ఎందుకు ఉన్నట్లుండి `మా` మీద ప్రేమ పుట్టుకొచ్చింది? మీకు మీరుగా వచ్చారా? లేక ఎవరైనా తెచ్చారా? మీరు కేవలం గ్రామాల్నే దత్తత తీసుకున్నారు? నేను ఏకంగా జిల్లానే దత్తత తీసుకున్నా? అందులో 60 మండలాలు ఉన్నాయి. ఇంత చేసాం..అంత చేసామని చెప్పుకునే వాళ్లు `మా`ని ఎందుకు దత్తత తీసుకోలేదు. `మా` లో ఒక్క మనిషినైనా దత్తత తీసుకున్నారా? మా అమ్మ నెలకి 15 వేలు `మా`కు ఇచ్చేది. ఏడాదికి ఒక మనిషిని దత్తత తీసుకునే వాళ్లం. మీరేంటి రెస్టారెంట్ లో డిస్కౌంట్లు..పబ్ ల్లో డిస్కోలు ఆడాలంటున్నారు? ఏంటో అర్ధం కాలేదని నరేష్ అసహనం వ్యక్తం చేసారు. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.