టాలీవుడ్ విలక్షణ నటుల్లో ప్రకాశ్ రాజ్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ప్రతి పాత్రకు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక పాత్ర ఏదైనా తడుముకోకుండా చకచకా డైలాగ్స్ చెప్పడం .. కళ్ల ద్వారా చకచకా భావాలను మార్చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన కాంబినేషన్లో ఎంతటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, వాళ్లు కూడా తమ డైలాగులు మరిచిపోయి తనవైపే చూసేలా చేసే సామర్థ్యం ఆయన సొంతం. ఇక తెరపై ఎలాంటి సీన్ జరుగుతున్నా ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకుని, శుభం కార్డు పడేవరకూ తన చుట్టూ తిప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు.
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. భాషల్లో ప్రకాశ్ రాజ్ బిజీ బిజీ. 15 ఏళ్ల క్రితం తెలుగు తెరకి ఆయన పరిచయమైన దగ్గర నుంచి ఇంతవరకూ గ్యాప్ రావడమనేది ఆయనకి తెలియదు. అక్కడక్కడా చిన్న గ్యాప్ వచ్చినా, అది ఆయన ఇతర భాషా చిత్రాల్లో తీరికలేకుండా ఉండటమే కారణం. అలా ఆయన తన జోరు చూపుతూ వస్తున్నారు. తెలుగులో కొత్త ఏడాదిలోను ఆయన తన నట విశ్వరూపం చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆయన నుంచి 'నారప్ప' .. 'వకీల్ సాబ్' .. 'అల్లుడు అదుర్స్' .. 'పుష్ప' సినిమాలు థియేటర్స్ కి రానున్నాయి.
ఈ సినిమాలన్నింటిలోను ప్రకాశ్ రాజ్ చాలా విభిన్నమైన పాత్రలను చేసినట్టుగా చెబుతున్నారు. ఏ పాత్రకి ఆ పాత్రే చాలా కొత్తగా .. డిఫరెంట్ గా అనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వెంకటేశ్ హీరోగా చేస్తున్న 'నారప్ప' సినిమాలో ప్రకాశ్ రాజ్ లాయర్ వేణుగోపాల్ పాత్ర చేశారు. చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ పాత్రలో ఆయన ఇరగదీసేశాడనే అంటున్నారు. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 'వకీల్ సాబ్' సినిమాలోనూ ప్రకాశ్ రాజ్ పోషించిన అడ్వకేట్ సూర్యప్రకాశ్ పాత్ర కూడా చాలా వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది. ఇక 'అల్లుడు అదుర్స్'లోను .. 'పుష్ప' లోను ఆయన తన మార్క్ చూపనున్నాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది కూడా ప్రకాశ్ రాజ్ జోరు మూమూలుగా ఉండదన్నమాట!