'గరుడవేగ' చిత్రం తర్వాత రాజశేఖర్ నటించిన చిత్రం 'కల్కి'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి చిత్రం ఫలితంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను తాజాగా ఒక మీడియా సమావేశంలో వ్యక్తం చేశాడు. సినిమాపై అంత నమ్మకం ఉన్న ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రం విషయంలో కూడా అప్పుడే చర్చలు మొదలు పెట్టాడు.
'అ!' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి రెండవ సినిమాగా 'కల్కి'ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ మూడవ సినిమాను ఏకంగా సూపర్ స్టార్ హీరోతో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ధనుష్ వద్దకు ప్రశాంత్ వర్మ ఒక విభిన్నమైన నేపథ్యంలోని కథను తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ లైన్ కు ధనుష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
'కల్కి' ఫలితంను బట్టి ప్రశాంత్ వర్మ తర్వాత సినిమా ఉంటుందని తెలుస్తోంది. కల్కి సినిమా మినిమం ఆడినా కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ నక్క తోక తొక్కినట్లే. ఎందుకంటే ప్రశాంత్ వర్మతో ధనుష్ సినిమా చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలున్నాయి. ధనుష్ తో సినిమా చేస్తే తమిళంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ స్థాయిలో కూడా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే కల్కి హిట్ అయితే ప్రశాంత్ వర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.