డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో మోతెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి పాన్ ఇండియా ఫ్రాంఛైజీతో అతడి పేరు ఇంటా బయటా మార్మోగింది. ఆ తర్వాతా `సాహో` హిందీ మార్కెట్లో అదరగొట్టింది. ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా రేంజ్ అని ఇప్పటికే ప్రూవైంది. అందుకే ఇప్పుడు ఇదే బాణీలో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం రాధేశ్యామ్ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీతో ఏమాత్రం పోలిక లేని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 21 గా చెబుతున్న ఈ మూవీపైనా భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ తర్వాత ప్రభాస్ 22 కోసం కేజీఎఫ్ డైరెక్టర్ బరిలో దిగాడని ఇటీవల ప్రచారమైంది. అతడు ప్రభాస్ ని ఏ రేంజులో చూపించబోతున్నాడు? అన్నదానిపైనా ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
కేజీఎఫ్ చిత్రాన్ని కోలార్ బంగారు గనుల మాఫియా కథతో అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రశాంత్ నీల్ సీక్వెల్ ని డబుల్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత కూడా ప్రభాస్ 22 కోసం మాఫియా కథనే ఎంపిక చేసుకున్నారట. ప్రభాస్ ని ఒక మాఫియా డాన్ గా చూపించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కేజీఎఫ్ ఫ్రాంఛైజీని నిర్మిస్తున్న హోంబలే సంస్థ నిర్మించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ జాయింట్ వెంచర్ లో నిర్మించే వీలుందని తెలుస్తోంది.