సింపుల్ లైన్ తీసుకుని తెలివిగా సినిమాలు తీయడంలో మారుతి తర్వాతనే. అతడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. సుప్రీంహీరో సాయి తేజ్ కథానాయకుడిగా జీఏ2 బ్యానర్ లో తెరకెక్కిస్తున్న `ప్రతిరోజు పండగే` ఈ కోవకే చెందుతుంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఇంతకుముందు టీజర్ .. లిరికల్ వీడియోలతోనే ఇంప్రెషన్ కొట్టేశాడు. పచ్చని పల్లెటూరి నేపథ్యం.. ఎన్నారై బ్యాక్ గ్రౌండ్ కుర్రాడికి అందమైన మరదలు సిస్టర్స్ కజిన్స్ ఉంటే.. ఒక అందమైన ఉమ్మడి కుటుంబం ఉంటే ఆ మజా ఎలా ఉంటుందో గ్లింప్స్ ని చూపించాడు. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం పండుగే పండగ. టైటిల్ కి తగ్గట్టే సాయి తేజ్ కి పండగ లాంటి హిట్టు కలిసి రానుందని అర్థమవుతోంది.
క్యాన్సర్ వల్ల మహా అయితే ఐదు వారాలు అయినా బతకడం కష్టం అని తెలిసిన తాత (సత్యరాజ్) కోసం విదేశాల నుంచి దిగొచ్చే ఎన్నారై మనవడిగా సాయి తేజ్ ఎంట్రీ అదిరిపోయింది. పెద్దాయన ఆరోగ్యం బాలేదని తెలిసీ విదేశాల్లో స్థిరపడిన వాళ్లు ఎవరూ రావడానికి అయినా ఇష్టపడరు. బిజీ లైఫ్ పర్యవసానం బిజినెస్ క్లాస్ ప్రేమల్ని ఈ ట్రైలర్ లో ఎలివేట్ చేశారు. ఇక బూరె బుగ్గల రాశీ ఖన్నా సాయితేజ్ మరదలిగా అదిరిపోయే ఎంట్రీనే ఇచ్చింది. అన్నట్టు సాయి తేజ్ తాత కోసం వచ్చాడా లేక రాశీ కోసం దిగొచ్చాడా? అసలు మిషన్ ఏమిటో అన్నది తెలియాలంటే పూర్తిగా సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ హిట్టయ్యింది. అయితే ఇందులో శతమానం భవతి షేడ్స్ కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆ సంక్రాంతి బ్లాక్ బస్టర్ పైనే సెటైర్ వేస్తూ మారుతి-బన్ని వాస్ బృందం.. విమర్శకుల బారిన పడకుండా తెలివిగా సేఫ్ జోన్ వెతుక్కున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ శతమానం భవతి తరహాలోనే వండి వార్చారని ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
Full View