అసలు ఏ దేశంలో ప్రేమికులు ఉండరు చెప్పండి? కాని ప్రేమకూ రొమాన్స్ కు తరతరాలుగా యుగయుగాలుగా ప్రతీకగా నిలిచన దేశం అంటే మాత్రం ఎవరికైనా ఫ్రాన్స్ గుర్తొస్తుంది. అక్కడి ప్యారిస్ - నైస్ - కేన్స్ వంటి నగరాలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ ప్రేమ దేశంలో ఒక రొమాంటిక్ మూవీ రిలీజవ్వబోతోంది. పదండి చూద్దాం.
మలయాళంలో దర్శకుడు ఆల్ఫోన్సో పుత్రేన్ రూపొందించిన సినిమా ''ప్రేమమ్''. దర్శకుడు రాసిన ప్రతీ డైలాగ్.. ప్రతీ సీన్ తాలూకు స్ర్కీన్ ప్లే.. పాటలు.. నివిన పౌళీ - అనుపమ పరమేశ్వరన్.. సాయి పల్లవిల నటన.. ఒక యువకుడి జీవితంలో జరిగే రకరకాల మార్పులూ.. ఆ సమయంలో ప్రేమలూ.. అద్భుతహా అంతే. అందుకే సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్. దానితో తెలుగులో నాగచైతన్య కూడా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాను చూసిన ఒక ఫ్రెంచ్ డిస్ర్టిబ్యూటర్.. ఇలాంటి రొమాంటిక్ సినిమాలను మా ఊరిలో అయితే తంబలు తంబలుగా వచ్చి చూస్తారంటూ.. డబ్బింగ్ రైట్స్ కొనుక్కొని ఫ్రెంచ్ వర్షెన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
మొత్తానికి ప్రేమమ్ సినిమాను ఏదో చిన్న సినిమాగా అభివర్ణించిన మలయాళం ఇండస్ర్టీ వారు.. ఈ సినిమా సక్సెస్ రేంజ్ చూసి షాకవుతున్నారు. ఇక రీమేక్ చేస్తున్న తెలుగు వర్షన్ కూడా హిట్టయ్యిందంటే.. నా సామిరంగా మల్లూ బాయ్స్ ఆనందానికి హద్దే ఉండదు.