కామెంట్: పైసలు గిట్టాలంటే ప్రీమియర్లు కావాలే

Update: 2016-08-03 22:30 GMT
అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు చాలా ముఖ్యం అయిపోయాయి. లోకల్ గా ఓ ఏరియాకి సమానంగా వసూళ్లను రాబట్టగలిగే సత్తా ఓవర్సీస్ మార్కెట్ ఉందనే విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. గత ఏడాదిగా చాలానే సినిమాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టాయి. రీసెంట్ గా పెళ్లిచూపులు మూవీ అయితే.. బడ్జెట్ మొత్తం అక్కడి రిలీజ్ లతో రాబట్టేస్తోందని అంటున్నారు.

ఓవర్సీస్ లో ఏ సినిమా అయినా పెర్ఫామ్ చేయాలంటే.. అక్కడ ప్రీమియర్ షోలు చాలా ముఖ్యం అయిపోయాయి. నాన్నకు ప్రేమతో.. - అ..ఆ.. లాంటి సినిమాలకు యూఎస్ ప్రీమియర్లు బాగా హెల్ప్ అయ్యాయి. అటు వసూళ్ల పరంగానే కాకుండా.. వీకెండ్ లో కలెక్షన్స్ కు.. పాటిటివ్ టాక్ స్ప్రెడ్ అవడానికి ప్రీమియర్లే కారణం. ఈ రెండు సినిమాలు 2 మిలియన్లకు పైగా వసూలు చేయగా.. చాలా సినిమాలు మంచి వసూళ్లు సాధించడానికి ప్రీమియర్ షోలే కారణం.

అయితే ఈడో రకం ఆడోరకం.. సెల్ఫీ రాజా.. లాంటి కొన్ని సినిమాలు ఇక్కడ బాగానే ఆడినా.. ఓవర్సీస్ లో ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. వీటికి ప్రీమియర్ షోస్ పడకపోవడం ఇందుకు రీజన్ గా చెప్పచ్చు. అక్కడ రిలీజ్ జరిగినా.. డిస్ట్రిబ్యూటర్లకు సరైన  ప్లానింగ్ లేకపోవడంతో.. ప్రీమియర్స్ పడలేదు. రీసెంట్ గా సునీల్ జక్కన్న పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అక్కడ వెయ్యి డాలర్లు కూడా రాబట్టలేకపోయిందీ సినిమా. ఈ లెక్కన ఓవర్సీస్ లో వసూళ్లు దక్కాలన్నా.. అక్కడి కలెక్షన్స్ రాబట్టాలన్నా ప్రీమియర్లు పడాల్సిందే అన్న విషయం అర్ధమైపోతోంది.
Tags:    

Similar News