ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాల కంటే కూడా అధికంగా టాలీవుడ్ సినిమాలు జాతీయ మీడియాలో సందడి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన విషయాలను చర్చించుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగింది. బాలీవుడ్ సినిమాల కంటే కూడా అధికంగా టాలీవుడ్ సినిమాలకు కొందరు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఇటీవల తమిళ స్టార్ హీరోలు.. కన్నడ హీరోలు కూడా తెలుగు లో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విజయ్.. ధనుష్.. శివ కార్తికేయన్.. సూర్య.. కార్తీ.. కొందరు కన్నడ స్టార్స్ కూడా తెలుగు లో సినిమాలను చేశారు.. ప్రస్తుతం చేస్తున్నారు. అదే జాబితాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయినట్లుగా ఉన్నాడు.
ఇతర భాషల హీరోలు తెలుగు లో తమ సినిమాలను డబ్ చేసి విడుదల చేయడం ద్వారా ఇక్కడ పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే పృథ్వీరాజ్ కూడా తెలుగు మార్కెట్ పై దృష్టిపెట్టినట్లుగా ఉన్నాడు. అందుకే ఇప్పటికే తెలుగు సినిమా సలార్ లో నటిస్తున్నాడు. అంతే కాకుండా తన కొత్త సినిమా కడువా ను తెలుగు లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఏదో డబ్బింగ్ చేసి వదిలామా అన్నట్లుగా కాకుండా హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాను ఇక్కడ కూడా ప్రమోట్ చేశాడు. పృథ్వీరాజ్ ఎన్నో మలయాళ సినిమాలను చేశాడు. వాటిల్లో ఏ ఒక్క దాన్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. కాని కడువా సినిమాను మాత్రం ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర భాషల హీరోల్లో కొందరికి మంచి మార్కెట్ ఉంది. వారి సొంత భాషల్లో సినిమా వసూళ్లు సాధించినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో కొందరు హీరోలు నటించిన సినిమాలు వసూళ్లు నమోదు అవుతున్నాయి. దాంతో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగు కు తన మార్కెట్ ను విస్తరించేందుకు కడువాను ఉపయోగించుకుంటున్నాడు.
త్వరలో సలార్ తో ఎలాగూ తెలుగు ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్ గానే రాబోతున్నాడు. ఆ సమయంలో కచ్చితంగా పృథ్వీ రాజ్ కు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడటం ఖాయం. ఆ సినిమా విడుదలకు ముందే కడువా సినిమా తో రావడం.. అది హిట్ అయ్యి ఇక్కడ పృథ్వీరాజ్ కు మార్కెట్ క్రియేట్ అయితే ఖచ్చితంగా సలార్ మూవీకి కూడా అదనపు బలం అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ సూపర్ స్టార్ తెలుగు మోజు తో వస్తున్న కడువా ఏ మేరకు విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.