'ఒరు ఆదార్ లవ్' చిత్రంతో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రియా వారియర్ తాజాగా 'శ్రీదేవి బంగ్లా' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కథ అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్రకు కాస్త దగ్గరగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ట్రైలర్ విడుదల తర్వాత శ్రీదేవి జీవిత కథ ఇది అంటూ చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి భర్త అయిన బోణీ కపూర్ సినిమాపై కేసు నమోదు చేశాడు. శ్రీదేవి బంగ్లా చిత్రం వివాదం నేపథ్యంలో ప్రియా వారియర్ స్పందించింది.
ప్రియా వారియర్ మాట్లాడుతూ.. ఈ విషయాలు అన్ని కూడా చిన్న విషయాలు. వీటిని నిర్మాతలు చూసుకుంటారు. నేను కేవలం సినిమాలోని నా పాత్ర ఏంటీ.. ఆ పాత్రకు నేను ఎంతగా న్యాయం చేస్తానంటూ చూసుకుంటాను. అంతే తప్ప ఈ వివాదాన్ని పట్టించుకోను. ఇలాంటి వివాదాలను నిర్మాతలు చూసుకుంటారని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంతో ఎవరిని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మాకు లేదని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది.
మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ చిత్రంతో నిరాశ పర్చిన ప్రియా వారియర్ ఈ చిత్రంతో సక్సెస్ అయ్యి మళ్లీ తన క్రేజ్ పెరగడం ఖాయం అంటూ ఆమె ఎదురు చూస్తుంది. కాని సినిమా మాత్రం వివాదాస్పదం అవ్వడంతో విడుదల ఆలస్యం అయ్యేలా ఉంది.