ప్రియా ప్రియా సంపొద్దే!! నవ్వీ.. నన్నే ముంచొద్దే!! అంటూ `జీన్స్` ట్యూన్ పాడాల్సిందే. మోనాలిసాకు అమ్మమ్మవా.. క్యాట్ విన్స్లెట్కి కజిన్ సిస్టర్ వా? అంటూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే.. ఈ రూపం చూశాక. అంత ఇదిగా.. కవ్విస్తున్న ఈ బ్యూటీ ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? గత కొంతకాలంగా వింక్ సెన్సేషన్ గా పాపులరైన ప్రియా ప్రకాష్ వారియర్ తనే. ఇటీవలే రిలీజైన ఒరు ఆడార్ లవ్ చిత్రం మల్లూవుడ్ లో తనకు బోలెడంత పాపులారిటీ తెచ్చింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రియా వారియర్ అందానికి టీనేజీ బోయ్స్ స్పెల్ బౌండ్ అయిపోయారు. తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజై పది రోజులు పైగా ఆడిందంటే అదంతా ప్రియా వింక్ సెన్సేషన్ కవ్వింత వల్లనే.
అందుకే ఇప్పుడు ప్రియా ప్రకాష్ నటిస్తున్న తర్వాతి సినిమా `శ్రీదేవి బంగ్లా` పైనా క్యూరియాసిటీ ఏర్పడింది. వివాదాస్పద టైటిల్ని ఎంచుకుంటే ఎంచుకున్నారు కానీ, ప్రియా పేరు మాత్రం దీంతో మరోసారి బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. 19 వయసుకే ఈ అమ్మడికి సన్నీలియోన్, దీపిక పదుకొనే రేంజు ఫాలోయింగ్ సామాజిక మాధ్యమాల్లో ఏర్పడింది. గూగుల్ లో అభిమానులు అత్యధికంగా వెతికే ఫోటో ప్రియా ప్రకాష్ దేనంటే ఆశ్చర్యం అవసరం లేదు.
తాజాగా రిట్జ్ మ్యాగజైన్ ఫోటోషూట్ తో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వంగపువ్వు రంగు గౌనులో మెరుపులు మెరిపించేస్తోంది. మోనాలిసా తరహా వేషధారణతో కాస్తంత ఏదో కొత్తగానే ట్రై చేసినట్టే అనిపిస్తోంది. మోనాలిసా ఈవిడ తాలూకానా? లేక ప్రియానే మోనాలిసా తాలూకానా? అంటూ వేడిగా డిస్కషన్ సాగుతోంది. అన్నట్టు ప్రియా రైట్ హ్యాండ్ పై ఆ పచ్చబొట్టు టూమచ్ హైలైట్ .. అంటూ బోయ్స్ లోనూ వేడెక్కించే టాపిక్ నడుస్తోంది. శ్రీదేవి బంగ్లా సినిమా వివాదాస్పదం అయ్యింది కదా? ఇది మీకు మంచిదేనా? అని ప్రశ్నిస్తే .. వివాదాలన్నీ మా దర్శకనిర్మాతలే చూసుకుంటున్నారు. నాకెందుకని పట్టించుకోలేదు అంటూ కాస్తంత తెలివిగానే సమాధానమిచ్చింది అమ్మడు.