ఇంటెర్నెట్ ను ఊపేస్తున్న పిల్ల తెలుగులోకి?

Update: 2018-02-14 07:26 GMT
మూడు రోజులుగా ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ గురించే చర్చ. ‘ఒరు అడార్ లవ్’ సినిమాలో భాగంగా చిత్రీకరించిన ఒక పాటలో తన హావభావాలకు ఫిదా అయిపోయారు కుర్రాళ్లు. ఒక టీనేజీ అమ్మాయి అంత అందంగా హావభావాలు పలికిస్తుంటే కుర్రాళ్ల గుండెలు లయ తప్పకుండా ఎలా ఉంటాయి? నిజానికి కుర్రాళ్లనేమి.. ఆ హావభావాలు చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే. ఆ 30 సెకన్ల వీడియోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన ప్రియ.. ఇప్పుడు ‘ఒరు అడార్ లవ్’ టీజర్ తో మరింతగా మురిపిస్తోంది. ఈ టీజర్ లో ఆమె తుపాకీ ముద్దు కూడా అప్పుడే సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఇంటర్నెట్లో ఈ టీజర్ కు వస్తున్న క్రేజ్ చూశాక ఈ చిత్రాన్ని మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం. తమిళం.. తెలుగు.. హిందీ భాషల్లో సైతం సినిమాను రిలీజ్ చేస్తారట. ప్రియ ప్రకాష్ వారియర్ కోసమైనా జనాలు సినిమా చూస్తారని.. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని నిర్మాత డిసైడయ్యాడట. టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి అందరికీ కనెక్టవుతుందని భావిస్తున్నారు. మార్చి 3న ఈ చిత్రం మలయాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మిగతా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారట. ఈ చిత్రంలో ప్రియకు జోడీగా రోషన్ అబ్దుల్ నటించాడు. ఆ అబ్బాయి హావభావాలు కూడా టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఒమర్ లు ఈ చిత్రాన్ని నిర్మించాడు.


Tags:    

Similar News