కళ్లతో రొమాన్స్ చేసిన పిల్ల ఎవరంటే అందరికి ఎవరు గుర్తొస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్లను అలా అలా రొమాంటిక్ గా ఆడించిన ఆ పిల్ల ఒక్కసారిగా దేశంలో యువతను తన వైపుకు తిప్పుకుంది. ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోల లెవెల్లో గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూడసాగారు. ఆ మలయాళం మూవీ ఇతర భాషల్లో కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయింది.
అయితే డిమాండ్ గట్టిగా రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ రీషూట్ చేసే పనిలో పడింది. ప్రియా వారియర్ క్యారెక్టర్ నిడివి సమయాన్ని ఇంకా పెంచాలని దర్శకుడు ఒమర్ లులు ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సినిమాలో ప్రియా వారియర్ క్యారెక్టర్ జస్ట్ 20 నిమిషాలు మాత్రమే ఉందట. అయితే ప్రోమోల తరువాత ప్రియా వారియర్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా40 నిమిషాల వరకు ఆమె క్యారెక్టర్ టైమింగ్ ని పెంచడానికి ట్రై చేస్తున్నారు.
అసలైతే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారట. అందులో ప్రియా వారియర్ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉందని ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని రీ షూట్ చేసే పనిలో పడ్డారు. స్క్రిప్ట్ లో మళ్లీ చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు వారు చేస్తోన్న పనులకు దాదాపు రెండు మూడు నెలల వరకు సమయం పట్టవచ్చు. మరీ అప్పటిలోపు క్రేజ్ తగ్గకుండా ఏమైనా ప్రమోషన్స్ చేసి హైప్ క్రియేట్ చేసుకుంటే బెటర్.