ముందు నేనే ప్ర‌పోజ్ చేశా -డస్కీ బ్యూటి

Update: 2015-09-16 09:30 GMT
టాలీవుడ్‌ ని ద‌శాబ్ధం పైగానే అలరిస్తోంది డస్కీ బ్యూటి ప్రియ‌మ‌ణి. స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్‌ లైన్ లేక‌పోయినా త‌న‌కంటూ ఓ స్టాట‌స్‌ ని ఎంజాయ్ చేసిందిక్క‌డ‌. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఆశించినంత ఎదుగుద‌ల లేదు. అందుకే ఇక పెళ్లితో ఓ ఇంటిదైపోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ‌ర్ ముస్త‌ఫాతో ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది.

ఇటీవ‌లే త‌న ప్రేమ వ్య‌వ‌హారం గురించి ప్రియ‌మ‌ణి ఓపెన్‌ గానే మాట్లాడింది. అంతేనా ఇప్పుడు ఇక పెళ్లి బాజాలాకు ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింద‌నే త‌నే మ‌రోసారి రివీల్ చేసింది. 2016లో పెళ్లి ఖాయం. ప్ర‌స్తుతం నాన్న‌గారు ముస్త‌ఫాతో మాట్లాడుతున్నారు. అస‌లు ముస్త‌ఫాతో నా ప‌రిచ‌యం, ప్రేమ అంతా విచిత్రం. అనుకోకుండా ఓ సెల‌బ్రిటీ క్రికెట్ టోర్నీలో క‌లిశాం. త‌ర్వాత స్నేహం పెరిగింది. ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహానికి మించి ఇంకేదో ఉంద‌ని అనిపించింది. ముందుగా నేనే ప్ర‌పోజ్ చేశా. అత‌డి నంబ‌ర్‌కు ఓ సంక్షిప్త సందేశాన్ని(ఎస్ ఎంఎస్‌) పంపించాను. దానికి రిప్ల‌య్ వ‌చ్చింది. న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని అన్నాడు. అత‌డిలోని కామిక్ సెన్స్ చాలా ఇష్టం నాకు. ముస్త‌ఫా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు. నాకు పూర్తిగా ఆపోజిట్‌. అందుకే మేం క‌లిశామేమో!

పెళ్లి త‌ర్వాత న‌టిస్తానా లేదా? అన్న‌ది అప్పుడే చెప్ప‌లేను. అప్ప‌టికీ ప‌రిశ్ర‌మ నుంచి పిలుపు వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తా. న‌టించ‌డానికి పెళ్లి అడ్డంకి కాదు. ముస్త‌ఫా కూడా అర్థం చేసుకుంటారు.. అంటూ చెప్పుకొచ్చింది అమ్మ‌డు.
Tags:    

Similar News