ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం భర్త నిక్ జోనాస్ తో లాస్ ఏంజెల్స్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా అమెరికాకే అంకితం చేసింది పీసీ. అక్కడ వరుసగా పలు అసైన్ మెంట్స్ కి సంతకాలు చేసి బిజీబిజీగా ఉంది. మునుముందు అమెరికన్ టీవీ షోస్ సహా హాలీవుడ్ సినిమాలతో బిజీ కానుంది. అలాగే నిర్మాతగానూ ప్రముఖ కార్పొరెట్ కంపెనీల టై అప్ తో సత్తా చాటేందుకు ఓటీటీ వేదికలపై ఆటలాడేందుకు సన్నాహకాల్లో ఉంది.
ఇంత బిజీగా ఉన్నా.. వీలున్న ప్రతిసారీ హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి ఫోటోషూట్లలో పాల్గొంటోంది. సోలోగానూ కొన్ని ఫోటోషూట్లను రివీల్ చేసింది పీసీ. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పీసీ ఫోటో సునామీ స్పీడ్ తో యువతరంలోకి దూసుకుపోతోంది. నెవ్వర్ బిఫర్ !! అనేంతగా పీసీ అందాల ఎలివేషన్ కి మత్తెక్కిపోతున్నారంతా. ఆ ఫ్రీస్టయిల్ కి తగ్గట్టుగా గాగల్స్ పెట్టుకుని పీసీ చిద్విలాసంగా కనిపిస్తోంది.
కళ్ళు మూసుకుని.. మృధువైన సూర్యకాంతి ఆమె ముఖం మీద పడటంతో పాటు ఆ ముఖంపై చిరునవ్వు మైమరిపిస్తోంది. `వేసవి చివరి కొన్ని రోజులు`` అంటూ ట్యాగ్ ని ఇచ్చింది పీసీ. ఈ ఛాయాచిత్రానికి ఇన్ స్టాగ్రామ్ .. ట్విట్టర్ లో టన్నుల లైక్లు కామెంట్లు వచ్చి పడ్డాయి. పీసీ బావగారైన కెవిన్ జోనాస్ భార్య డేనియల్ జోనాస్ అయితే హార్ట్ ఎమోజీని షేర్ చేసి ఎగ్జయిట్ అయ్యారు. బాలీవుడ్ అందాల నటి నర్గీస్ ఫఖ్రీ ``మంచి షాట్`` అని వ్యాఖ్యానించారు. మొత్తానికి పీసీకి అదిరిపోయే రిప్లయ్ వచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఈ అందమైన ఫోటోని కెమెరాలో క్లిక్ మనిపించింది ఎవరు? అంటే.. ప్రియాంక బంధువు దివ్య జ్యోతి క్లిక్ చేశారట.