అందగత్తెను ఏ యాంగిల్ చూసినా అందంగానే కనిపిస్తుంది. ఇంకా చూడాలనే అనిపిస్తుంది. తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్నే గెలుచుకున్న ప్రియాంక చోప్రా లాంటి అందగత్తెనయితే చూస్తూ ఉండిపోవాలనే అనిపిస్తుంది. అదీ హీటెక్కించే హాట్ ఫోజుల్లో అయితే మరి చెప్పాల్సిన పనేలేదు. అందుకే కవర్ పేజ్ గర్ల్ గా ప్రియాంక కొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది.
ప్రముఖ మ్యాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజీకి ఎక్కడమంటే గ్యారంటీగా ఆ హీరోయిన్ కు మంచి గుర్తింపు దక్కినట్టే. ఈ ఘనతను ప్రియాంక చోప్రా ఇప్పటికి ఐదుసార్లు దక్కించుకుంది. తాజాగా ట్రాన్స్ పరెంట్ వైట్ డ్రస్ లో అమ్మడు ఇచ్చిన హాట్ స్టిల్ చూస్తే మతి పోగొట్టుకోవాల్సిందే. బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంటరయి బికినీల్లో కనిపించిన ఈ బ్యూటీ కవర్ పేజీపైనా అదే రేంజిలో అందాలు ఒలకబోయడంతో ప్రియాంక అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ఇదే టైంలో 2018లో మాగ్జిమ్ ఎంపిక చేసిన టాప్ 100 హాట్ ఉమెన్ లో ప్రియాంకనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.
అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో కోసం ఈమధ్య యూఎస్ లోనే ఎక్కువగా ఉంటున్న ప్రియాంక అక్కడి సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో పడిందనే మాట బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా నిక్ జోనాస్ ను వెంటేసుకుని మరీ ప్రియాంక ఇండియాకు రావడం... అతడితో కలిసి గోవాకు వెకేషన్ చెక్కేయడం వంటివి ఈ గాసిప్స్ కు బలం పెంచాయి. దీంతో ఈమధ్యప్రియాంక పేరు న్యూస్ లో బాగా వినిపిస్తోంది.