మాస్ కుర్రాళ్ల మనసు దోచేసిన బ్యూటీ!

Update: 2020-12-20 01:30 GMT
ఒకప్పుడు కథనుబట్టి అందుకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసేవారు. నటీనటులు ఆ కథలో కలిసిపోయే కనిపించేవారు. ఆ తరువాత స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్ల డేట్స్ సెట్ చేసుకుని కథను అల్లుకోవడం మొదలైంది. అప్పుడైనా .. ఇప్పుడైనా సినిమాలో కామన్ గా కనిపించేది ఒక్కటే, అదే .. హీరోయిన్ గ్లామరస్ గా కనిపించడం. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా .. దర్శకుడికి ఎంత ఇమేజ్ ఉన్నా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో హీరోయిన్ గ్లామర్ కీలకమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హీరో డైలాగ్స్ అదరడగొడుతున్నా .. డాన్సులు ఇరగదీస్తున్నా .. పక్కన హీరోయిన్ లేకపోతే 'కిక్' ఉండదనేది మాస్ కుర్రాళ్ల మాట.

థియేటర్స్ కి వచ్చేవాళ్లలో మాస్ .. కాలేజ్ కుర్రాళ్లు ఎక్కువగా ఉంటారు గనుక, వాళ్లను దృష్టిలో పెట్టుకునే ఎక్కువ సినిమాలు రూపొందుతూ ఉంటాయి. వాళ్ల టేస్టును బట్టే గ్లామర్ తో మెరిసే హీరోయిన్లను ఎంపిక చేస్తుంటారు. వాళ్లకి బోర్ కొట్టించకుండా ఉండటం కోసమే ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను రంగంలోకి దింపుతుంటారు. అలా ఇటీవల కాలంలో 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా తెలుగు తెరకు 'ప్రియాంక అరుళ్ మోహన్' పరిచయమైంది. ఈ నాజూకు భామను చూసి కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. గ్లామర్ అంటే ఇదేనంటూ ఈ సుందరి ఫోటోని గుండె గోడకి గోల్డ్ మెడల్లా తగిలించేసుకున్నారు.

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా ప్రియాంక అరుళ్ మోహన్ ఆకట్టుకుంది. ఆ సినిమా వలన వచ్చిన క్రేజ్ కారణంగానే 'శ్రీకారం'లోను ఛాన్స్ కొట్టేసింది. శర్వానంద్ జోడిగా ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ లో .. లిరికల్ వీడియో సాంగ్స్ లో ఈ బ్యూటీ వెన్నెల్లో చందమామలా వెర్రెక్కిస్తోంది. వచ్చే ఏడాదిలో థియేటర్స్ కి రానున్న ఈ సినిమా కోసం వాళ్లంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. తెలుగులోనే కాదు .. తమిళంలోను వరుస ఆఫర్లు ఈ అమ్మాయి డోర్ బెల్ కొడుతున్నాయట. న్యూ ఇయర్లో ఈ సుందరి మరింత స్పీడ్ తో దూసుకెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
Tags:    

Similar News