సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన 'PSV గరుడ వేగ' సినిమా లావాదేవీల వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జీవిత - రాజశేఖర్ లు తమ నుంచి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపిస్తూ జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు కేసు వారిపై పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ప్రెస్ మీట్ పట్టి మరీ ఆవేదన వ్యక్తం చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై జీవిత రాజశేఖర్ కూడా వివరణ ఇచ్చారు. రూ. 26 కోట్లు మోసం చేశారని కోటేశ్వర్ రాజు అంటున్నారని.., అవి ఏ కోట్లో అర్థం కావడం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అవన్ని తప్పుడు ఆరోపణలని ఆమె స్పష్టం చేశారు. అలాగే కోటేశ్వర రాజు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని జీవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా 'గరుడవేగ' నిర్మాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
జీవితా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తమపై చేస్తోన్నవన్నీ అసత్య ఆరోపణలనే అన్నారు కోటేశ్వర రాజు. నిజానికి జీవిత రాజశేఖర్ ప్రొడ్యూసర్లను ట్రాప్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము లండన్ నుండి వచ్చాం.. ఆమె ట్రాప్ లో పడబోము.. ఆవలిస్తే పేగులు లెక్కబెడతామన్నారు కోటేశ్వర రాజు.
జీవితా రాజశేఖర్ తన మామను తీసుకొచ్చి కాళ్లు పట్టుకుని అప్పు తీసుకుందని అన్నారు. ఆ రోజు జీవిత కాళ్ళు పట్టుకుందని కాదు.. వాళ్ళ మామని చూసి డబ్బు ఇచ్చామన్నారు. రాజశేఖర్ కు డబ్బు అవసరంలేదని.. అతని భార్య జీవితకు డబ్బు అవసరం ఉందనని.. సినిమా ముసుగులో ఎవరొకరి దగ్గర డబ్బు తీసుకుంటుందని ఆరోపించారు.
గతంలో జీవిత చాలా సార్లు మోసం చేసిందని రాజశేఖర్ తండ్రి వరదరాజన్ తమ దగ్గర చెప్పి బాధపడ్డారని నిర్మాత తెలిపారు. జీవిత రాజశేఖర్ ఈ విధంగా మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. అది ఆమె తరం కాదు. ఎందుకంటే దొంగ ఎప్పటికీ దొర కాలేడు అని అన్నారు. డబ్బు తీసుకున్న రోజు మేము రాజశేఖర్ కు దేవుళ్లుగా కనిపించాం. ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాం కనుక అలా కనిపించలేదా అని కోటేశ్వర రాజు ప్రశ్నించారు.
జీవిత చిలక పలుకులు మీడియాకు చెప్పడం కాదని.. కోర్టుకు చెప్పాలని ఎద్దేవా చేశారు. డాక్యుమెంట్లు పోయాయని 420 వేశాలు వేస్తూ రాజశేఖర్ కు జీవిత ఏం చెప్పిందో అని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ కోసం తన తమ్ముడిని డ్రగ్స్ తీసుకురావడానికి పంపించడం.. అతను అరెస్ట్ కావడం.. రాజశేఖర్ యాక్సిడెంట్లు చేయడం.. నువ్వు వెళ్లి ఆయనకు మనసు బాగాలేదని చెప్పడం వంటివి గూగుల్ లో కొడితే తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
రాజశేఖర్ తో సినిమా తీసేవాళ్లు లేరు.. సినిమా విడుదలైతే చూసేవాళ్లు ఎవరూ లేరు.. సినిమా ఓపెనింగ్ టికెట్లు కూడా వచ్చేదీ లేదని నిర్మాత కోటేశ్వర రాజు అన్నారు. ఎక్కడైనా దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. లీగల్ గా తేల్చుకుంటామన్నారు గరుడ వేగ నిర్మాత.