టాలీవుడ్ స్ట్రైక్ పై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

Update: 2022-08-11 08:50 GMT
టాలీవుడ్ విధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ని, టికెట్ రేట్లు పెరిగిపోవ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని, అంతే కాకుండా ఓటీటీ ల ప్ర‌భావం కార‌ణంగా సినిమా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ప‌రిణిమిస్తోందిని, అంతే కాకుండా స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్ ల కార‌ణంగా నిర్మాణ వ్య‌యం హ‌ద్దులు దాటుతోందంటూ ఇటీవ‌ల ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ టాలీవుడ్ షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ వ్య‌తిరేకించినా ఆ త‌రువాత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి మేము సైతం అంటూ మ‌ద్దుతుగా నిలిచింది.

దీంతో ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆగ‌స్టు 11తో నేటికి 11 రోజులు కావ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో యంగ్ ప్రొడ్యూస‌ర్ అభిషేక్ నామా టాలీవుడ్ బంద్ సై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తూ ప్రొడ్యూస‌ర్ల‌కు ఓపెన్ లెట‌ర్ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ప్ర‌ధానంగా ఐదు కీల‌క అంశాల‌ని ప్ర‌స్తావిస్తూ అభిషేక్ నామా రాసిన ఓపెన్ లెట‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. నేను మొద‌టి నుంచి టాలీవుడ్ స‌మ్మెకు వ్య‌తిరేకిస్తున్నాను. అయితే స‌మ్మె నిర్మాత‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌కు మేలు చేస్తుంద‌ని కొంత మంది చెప్ప‌డంతో వారి మాట‌ల‌కు నేను క‌ట్టుబ‌డి నా సినిమాల షూటింగ్ ల‌ని నిలిపివేశాను. దీని వ‌ల్ల నేను చాలా న‌ష్ట‌పోయాను.

స‌మ్మె ప్రారంభ‌మై ప‌ది రోజులు కావ‌స్తోంది. స‌భ్యులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల విష‌యంలో నాకు క్లారిటీ లేదు అంటూ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులకు సంబంధించిన సీక్రెట్ డీలింగ్స్ ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. 1) ఓటీటీ రిలీజ్ లు, 2) టికెట్ ధ‌ర‌, 3) ప‌ర్సెంటేజ్ వ్య‌వ‌స్థ‌, 4) వీపీఎఫ్‌, 5) ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ వంటి ఐదు ఆంశాల గురించి అస‌లు జ‌రిగింది ఏంటీ? జ‌రుగుతున్న‌ది ఏంటీ? ఇవి ఎంత వ‌ర‌కు సాధ్యం? ఓటీటీ రిలీజ్ ల‌పై, టికెట్ ధ‌ర‌ల‌పై మాట్లాడుతున్న వారు ఏం చేశారు? ఏం చేస్తున్నారు వంటి కీల‌క అంశాల‌కు కుండ బ‌ద్ద‌లు కొట్టారు.  

స‌భ్యులు చెప్పిన స‌మ‌స్య‌ల‌పై నా అభిప్రాయం అంటూ ఐదు అంశాల గురించి కులంక‌శంగా వివ‌రించి షాకిచ్చారు. ముందుగా ఓటీటీ రిలీజ్ ల‌పై మాట్లాడుతూ 'ప్ర‌శ్నార్థ‌క‌మైన విష‌యం ఏంటంటే థియేట్రిక‌ల్ రిలీజ్ లైన 2 వారాల త‌రువాత ఓటీటీల‌లో సినిమాలు విడుద‌ల చేయ‌డం వ‌ల్ల థియేట్రిక‌ల్ అమ్మ‌కాలు ప్ర‌భావితం అవుతున్నాయి. వాస్త‌వం ఏంటంటే యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూస‌ర్స్ లోని చాలా మంచి ఇప్ప‌టికే 2023 వ‌ర‌కు త‌మ సినిమాల‌ని ఓటీటీల‌కు ఇచ్చేసి డీల్స్ పూర్తి చేసుకున్నారు. ఇలాంటి త‌రుణంలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల‌ని 8 వారాల త‌రువాతే ఓటీటీల‌కు ఇవ్వాల‌న్న నిర్ణ‌యం ఎలా అమ‌లు జ‌రుగుతుంది?. 60 నుంచి 70 శాతం హిందీ డ‌బ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా రిక‌వ‌రీ అవుతోంది. అలాంట‌ప్పుడు చాలా వ‌ర‌కు నిర్మాత‌లు 8 వారాల త‌రువాతే ఓటీటీల‌కు ఇవ్వాల‌నే నిర్ణ‌యం వ‌ల్ల న‌ష్ట‌పోతారు. ఈ నిర్ణ‌యాన్ని ఎలా స్వాగ‌తిస్తారు?.

స‌మ్మె వ‌ల్ల నిర్మాత‌ల‌కు లాభం అన్న‌ప్పుడు ఈ నిర్ణ‌యం ఎందుకు చేస్తారని ప్ర‌శ్నించారు. ఇక టికెట్ ధ‌ర‌ల గురించి మాట్లాడాలంటే హీరో మార్కెట్‌, కంటెంట్ డిమాండ్ ని బ‌ట్టి బ‌డ్జెట్ ల‌ని పెంచ‌డం అన్న‌ది నిర్మాత తీసుకునే నిర్ణ‌యం. ఈ నేప‌థ్యంలో సినిమాని బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌కు నియంత్రించే అధికారం నిర్మాత‌ల‌కు వుంటుంది. ధ‌ర‌లు పెంచేతి ఎగ్జిబిట‌ర్లు కాదు. అలాంటప్పుడు మేము టికెట్ ధ‌ర‌ల‌పై స‌మ్మె ఎందుకు చేస్తున్నాయో ఏం చెప్పాల‌నుకుంటున్నామో నాకు అర్థం కావ‌డం లేద‌న్నారు.  ప‌ర్సెంటేజీ విధానం వ‌ల్ల నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు లాభ‌ప‌డ‌తారు. కానీ ప్ర‌ధాన న‌గ‌రాల్లోని థియేట‌ర్ల‌కు భారీ స్థాయిలో అద్దెలు చెల్లించాల్సిన ప‌రిస్థితి దీని వ‌ల్ల ఎవ‌రికి లాభం చేకూరుతోంది? అని ప్ర‌శ్నించారు.

ఇక వీపీఎఫ్ సిస్ట‌మ్. ఎప్ప‌టికీ ఇది పెద్ద ర‌హ‌స్య‌మే. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ఈ ఛార్జీలు చెల్లించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఈ విధానం తీసేస్తున్నాం అన్నారు. ఇంత‌కీ ఈ ఛార్జీలు ఎవ‌రు చెల్లించ‌బోతున్నార‌న్న‌ది మిస్ట‌రీగానే మిగిలింది. నిర్మాణ వ్య‌యం పై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఈ విషయంలో మ‌నం ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నాం అన్న‌ది క్లారిటీ లేద‌న్నారు. ఫైన‌ల్ గా మ‌న‌లోని అహంకారాల‌ను, అంత‌ర్గ‌త విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి ఈ మొత్తం విష‌యాన్ని పున‌రాలోచించుకోవాలి అని ప్ర‌తీ ఒక్క‌రినీ అభ్య‌ర్థిస్తున్నాను. మంచి కంటెంట్ ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది కాబ‌ట్టి మ‌న దృష్టి దానిపై మాత్ర‌మే వుండాలి అంటూ నిర్మాత‌ల‌లో వున్న అనౌక్య‌త‌ను మ‌రో సారి బ‌య‌ట‌పెట్టారు యువ నిర్మాత అభిషేక్ నామా. దీనిపై టాలీవుడ్ లో ఎలాంటి చ‌ర్చ మొద‌ల‌వుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News