''జనతా గ్యారేజ్'' సినిమాలో ఎన్టీఆర్ కజిన్ గా నటిస్తున్నాడు మలయాళం హీరో ఉన్ని ముకుందన్. లెజండ్ మోహన్ లాల్ కొడుకుగా నటిస్తున్న ఉన్ని.. ఈ మధ్యనే మలయాళంలో.. అవురడే రవుకల్ అనే సినిమాలో హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా నిర్మాత అజయ్ కృష్ణన్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
నిజానికి ఈ సినిమాను నిర్మించడానికి అజయ్ కు దాదాపు 4 కోట్లు ఖర్చయ్యింది. ఇదే తాను ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా. అయితే గత రాత్రి ఆయన సినిమా ఫైనల్ కాపీ ఓసారి వేసుకొని చూశాక.. ఈ సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని డిసైడ్ అయిపోయారట. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేసిన అజయ్.. ఒకవేళ లాసులు వస్తే.. ఆర్ధిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొనాలి అని చాలా కంగారుపడ్డాడట. దానితో కలత చెంది.. ఆత్మహత్యే శరణ్యం అనుకుని.. ఉరివేసుకొని చనిపోయాడు. ఈరోజు అతగాడి అంత్యక్రియలు జరగనున్నాయి.
అసలు ఒక సినిమా తీయడం.. ఆ సినిమాతో లాభాలు రాక నష్టాలు వస్తే ఆత్మహత్య చేసుకోవడం.. ఇది చాలా టూమచ్ గురూ. బిజినెస్ అన్నాక లాసులు రాకుండా ఎలా ఉంటాయి?