దిల్ రాజు...నిర్మాతగా...సినిమా పంపిణీ దారుడుగా...సినిమా వ్యాపారంలో దూసుకుపోతున్న వారిలో ఒకరు. ఒక రకంగా చెప్పాలి అంటే 'ఆ నలుగురు' లో ఒకరు అన్న విమర్శలు లేకపోలేదు...అయితే అలాంటి దిల్ రాజు ఇప్పుడు పెద్ద రిస్క్ చేస్తున్నాడా? సినిమాపై నమ్మకంతో భారీగా డబ్బులు పెట్టి ఆ చిన్నసినిమాను కొన్నాడా? అంటే అవును అనే అంటున్నాయి సినిమా వర్గాలు. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే...నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 118 పై భారీ ఆశలే పెట్టుకున్నాడు...నందమూరి హీరో...ఇక మరో పక్క ఈ సినిమా ట్రైలర్ సైతం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచడంతో...ఈ సినిమాపై ఆశ పడ్డాడు మన నిర్మాత దిల్ రాజు...
కట్ చేస్తే ఈ సినిమాను చూసిన దిల్ రాజు...దాదాపుగా 7 కోట్లు ఖర్చు పెట్టి...ఆంధ్ర-నైజామ్ రైట్స్ ను కొనేసాడు. అయితే సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా చూసేందుకు వెళ్లే సమయంలో ఈ సినిమా నచ్చితే నైజామ్ రైట్స్ తీసుకుందాం అని అనుకున్న రాజు గారు...సినిమా అంచనాలను మించి ఉండడంతో అన్ని ప్రాంతాల రైట్స్ తానే కొనాలి అని ఫిక్స్ అయిపోయాడు. అయితే అప్పటికే సీడెడ్ రైట్స్ అమ్ముడు పోవడంతో మిగిలిన రెండు ప్రాంతాల రైట్స్ ను 7 కోట్లకు కొనేసాడు దిల్ రాజు. ఇక సీడెడ్ కూడా కలుపుకుని మొత్తంగా ఈ సినిమా 9 కోట్లకు అమ్ముడు పోయింది ఈ సినిమా.
ఇదిలా ఉంటే మరో పక్క కల్యాణ్ రామ్ కి మార్కెట్ పెద్దగా లేదు...ఆయన సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితులు అంతకన్నా లేవు....మరి ఈ క్రమంలో దిల్ రాజు అంత ఖర్చు పెట్టి మరీ ఈ సినిమాను కొనడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు...మరి దిల్ రాజు నచ్చి రెండు ప్రాంతాల రైట్స్ కొన్నాడు అంటే... సినిమాలో ఏదో తెలియని డిఫరెంట్ యాంగిల్ ఉంది అనే అనుకోవచ్చు. చూద్దాం మరి దిల్ రాజు అదృష్టం ఎలా ఉండబోతుందో...మరో పక్క వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో?