అదంతా చెత్త.. ర‌ష్మిక విష‌యంలో 'పుష్ప‌' ప్రొడ్యూస‌ర్ క్లారిటీ!

Update: 2022-06-23 05:55 GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ఒక‌రు. ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అతి కొద్ది స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు వాంటెడ్ హీరోయిన్ గా మారిన‌ ఈ క‌న్న‌డ సోయ‌గం.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ స‌త్తా చాటుతోంది. ఇక‌పోతే ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తొలిసారి జ‌త‌క‌ట్టిన చిత్రం 'పుష్ప'. ఇదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాగా.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ 'పుష్ప ది రైస్‌' టైటిల్ తో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. మొద‌ట్లో నెగ‌టివ్ రివ్యూలు వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ అదిరిపోయే క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది. దీంతో ఇప్పుడు అంద‌రి చూపులు పార్ట్ 2 అయిన 'పుష్ప ది రూల్‌'పైనే ప‌డ్డాయి.

ఫిబ్ర‌వరిలోనే పుష్ప 2 సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల డిలే అవుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సుకుమార్ స్క్రిప్ట్ లో ప‌లు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. జూలై లేదా ఆగ‌స్టులో రెగ్యుల‌ర్ షూటింగ్ ను షురూ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే, మొద‌టి పార్ట్ లోశ్రీవ‌ల్లిగా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న ర‌ష్మిక.. సెకెండ్ పార్ట్ లో చ‌నిపోతుంద‌ని ఓ వార్త గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

బ‌న్నీపై ప‌గ తీర్చుకోవ‌డం కోసం విల‌న్ లు ర‌ష్మిక‌ను చంపేస్తార‌ని, ఈ మూవీకి ట‌ర్నింగ్ పాయింట్ కూడా అదే అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంపై తాజాగా 'పుష్ప‌' ప్రొడ్యూస‌ర్స్ లో ఒక‌రైన వై. రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. 'నెట్టింట జరుగుతున్న ప్ర‌చార‌మంతా చెత్త. నాన్సెన్స్‌. నిజానికి పుష్ప 2 కథేంటో మాకే సరిగ్గా తెలియదు.

అవన్నీ ఊహాగానాలు మాత్రమే. ర‌ష్మిక పాత్ర చ‌నిపోతుంది అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు. త‌మ రేటింగ్ ను పెంచుకునేందుకు పలు వెబ్ సైట్‌లు, టీవీ ఛానెల్స్‌ సినిమాలపై ఇలానే రాస్తాయి. వాటిని గుడ్డిగా న‌మ్మ‌కండి' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తం శెట్టీ మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. అలాగే సునీల్‌, అన‌సూయ‌, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.
Tags:    

Similar News