పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి.. మధ్యలో నిర్మాత?

Update: 2021-10-01 12:03 GMT
రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనపై కోపంతో వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష కడుతోందని.. అందులో భాగంగానే టికెట్లు ప్రభుత్వం అమ్ముతోందనే సరికొత్త చర్చకు దారితీసింది. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రంగంలోకి దిగి నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనమయ్యాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి నిర్మాత నట్టి కుమార్ వచ్చి చేరారు.

తాజాగా పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి వ్యవహారంపై నిర్మాత నట్టికుమార్ స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోసాని కృష్ణమురళి ఇంటి మీద పవన్ ఫ్యాన్స్ చేసిన దాడిని ఖండిస్తున్నానని’ తెలిపారు. ఎవరు మాట్లాడినా మధ్యలోకి కుటుంబాలను తీసుకొస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. అభిమానులు కూడా మీ నాయకులకు మంచి పేరు వచ్చేలా ప్రవర్తించాలని హితవు పలికారు.

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్స్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేస్తుంటే ప్రభుత్వాలు, అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఏ సమావేశం జరిగినా వారే ఎందుకు పాల్గొంటారని నట్టి కుమార్ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ ఆరుగురేనా? చిన్న నిర్మాతలను సమావేశాలకు ఎందుకు పిలవరంటూ ప్రశ్నలు సంధించారు.

ఇక జగన్ అందరినీ అందరివాడిలా చూస్తారని నట్టికుమార్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఒక పెద్దస్టార్ అని.. ఇందులో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయం లేదని.. కానీ రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు నిర్మాతలు పవన్ కు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని విమర్శించారు. ఇక చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన లేఖ అందరితో చర్చించి రాయలేదని.. కేవలం ప్రెసిడెంట్, కార్యదర్శి మాత్రమే పంపించారని నట్టి కుమార్ ఆరోపించారు.




Tags:    

Similar News