టాలీవుడ్ లో ఆయనో స్టార్ ప్రొడ్యూసర్. ఈయన తీసిన లేటెస్ట్ ఫిలిం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అయినా సరే తన కాంటాక్ట్స్ అన్నీ ఉపయోగించి మరోసారి క్రేజీ కాంబినేషన్ సెట్ చేయగలిగాడు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒక హీరోని.. టాప్ డైరెక్టర్ తో సినిమా ఖాయం చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ మూవీకి సిద్ధం అయ్యాడు. ఇంతలోనే 500 -1000 నోట్ల రద్దు వ్యవహారం జరిగిపోయింది. దీంతో స్టార్ ప్రొడ్యూసరే అయినా.. ఒక్కసారిగా ఇరుక్కుపోయిన సిట్యుయేషన్ వచ్చిందాయే.
అయితే.. ప్రాజెక్టు విషయంలో కానీ.. పారితోషికం విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదీ ప్రొడ్యూసర్. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం అడ్జస్ట్ చేయలేక.. హీరో-డైరెక్టర్లు ఇద్దరినీ కొంత మొత్తం రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని.. ఆ అమౌంట్ ని కూడా మూవీ రిలీజ్ అయ్యాక పేమెంట్ చేస్తానని ప్రామిస్ చేశాడట. ఈ ప్రపోజల్ కి ఇంకా స్టార్ హీరో నుంచి కానీ.. దర్శకుడి నుంచి కానీ ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఒకవేళ ఇందుకు ఒప్పుకుంటే కనీసం 25శాతం పారితోషికానికి కోత పెట్టుకోవాల్సి వస్తుందట.
ఇలా తక్కువ తీసుకోవడాలు.. తగ్గించుకోవడాలు లాంటి వాటికి ఈ స్టార్ చాలా దూరం. పేమెంట్ విషయంలో మహా స్ట్రిక్ట్ అనే టాక్ ఉంది. అందుకే ఈ ప్రొడ్యూసర్ ప్రతిపాదనపై ఇంకా ఆలోచనలోనే ఉన్నాడట. ఇప్పటికైతే.. నిర్మాత చెప్పిన దానికి అంగీకరిస్తేనే ప్రాజెక్టు ముందుకు కదలడం సాధ్యం అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఏ విషయమైనా తేల్చాల్సింది మాత్రం ఆ స్టార్ హీరోనే. ఎందుకంటే.. ఈయన ఒప్పుకుంటే దర్శకుడికి కూడా ఆప్షన్ ఉండదు మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/