ప్ర‌మోలో ప్ర‌భాస్..స‌ల్మాన్ పై పంచ్ వేసేశాడండోయ్!

Update: 2022-12-17 13:30 GMT
అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 రీసెంట్ గా మొద‌లై సీజ‌న్ 1 ని మించి మ‌రింతగా ఆహా ఓటీటీలో ర‌చ్చ చేస్తోంది. సీజ‌న్ 1 కి మించి సెల‌బ్రిటీతో బాల‌య్య ద‌బిడి దిడిబి ఆడేస్తూ న‌వ్వులు పూయిస్తున్నారు. స్టార్స్ సీక్రెట్స్‌ని స‌హ స్టార్స్ తో లీక్ చేయిస్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ స్టార్ల‌ని త‌న‌దైన స్టైల్లో ఆటాడేసుకుంటున్నారు. ఇవ‌న్నీ తెలిసే ఈ షోలోకి ప్ర‌బాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. త‌న‌తో పాటు త‌న ఫ్రెండ్, హీరో గోపీ చంద్ కూడా ఈ షోలో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 లో బాల‌య్య పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో లేటెస్ట్ ఎపిసోడ్ చేస్తున్నాడ‌న్న వార్త బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి ఈ ఎపిసోడ్ ఓటీటీలో ఎప్పెప్పుడు స్ట్రీమింగ్ కానుందా?.. బాల‌య్య ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భాస్ ఎలాంటి స‌మాధానాలు చెప్ప‌బోతున్నాడు?.. పెళ్లి వార్త‌ల‌పై ప్ర‌భాస్ ని బాల‌య్య ఎలా ఇబ్బంది పెట్ట‌బోతున్నాడు. మొత్తానికి ప్ర‌భాస్ పెళ్లిని ఈ ఎపిసోడ్ లో బాల‌య్య తేల్చేయ‌బోతున్నాడా? అంటూ ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌భాస్ అభిమానులు, ప్రేక్ష‌కులు తాజా ఎపిసోడ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫైన‌ల్ గా శన‌వారం విడుద‌ల చేస్తున్న ప్రోమోలో ఎలాంటి సంభాష‌ణ‌లు వుండ‌బోతున్నాయి. బాల‌య్య‌.. ప్ర‌భాస్ ని ఏమి అడ‌గ‌బోతున్నాడ‌ని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్ష‌ణ‌కు తెర ప‌డింది. ప్ర‌భాస్‌, గోపీ చంద్ ల ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రానే వ‌చ్చేసింది. `బాహుబ‌లి అనే ర‌మ్య‌కృష్ణ పిలుపుతో ప్రోమో మొద‌లైంది.. కాస్య‌పేశ్య గోత్రో భ‌వ‌శ్యా..ఉప్ప‌ల‌పాటి ప్ర‌భాస్ రాజు నామ‌ధేయ‌శ్యా..బాహుప‌రాక్‌.. అంటూ బాల‌య్య ఆహ్వానించ‌గా.. బాహుబ‌లి మ్యూజిక్ ప్లే అవుతుండ‌గా.. ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చాడు.  

స‌భా ముఖంగా ప్రేమ‌గా అడుగుతున్నాను.. న‌న్ను కూడా డార్లింగ్ అని పిల‌వాలి అంటూ బాల‌య్య మొద‌లెట్టాడు.. వెంట‌నే స‌రే డార్లింగ్ స‌ర్‌ అనేశాడు ప్ర‌భాస్. మోన్నామ‌ధ్య శ‌ర్వానంద్ వ‌చ్చాడు.. పెళ్లెప్పుడ‌న్నా..ప్ర‌భాస్ త‌రువాతే అన్నాడ‌ని బాల‌య్య చెబితే.. నేను స‌ల్మాన్ ఖాన్ త‌రువాత అనాలేమో అని ప్ర‌బాస్ అన‌డంతో అక్క‌డున్న వారంతా ఘోల్లున న‌వ్వేశారు. నిన్నొక స్పాట్ లో పెట్టే గేమ్ ఆడ‌తాన‌ని బాల‌య్య అంటే అలా పెడ‌తార‌నే డిసైడ్ అయ్యి వ‌చ్చాన‌ని ప్ర‌బాస్ అన్నాడు.

నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ? అని అడిగితే...సైలెంట్ అయిపోయిన ప్ర‌భాస్ మీక‌స‌లు ఏ ఇబ్బందులు లేవ‌స‌లు..మాకు ఇబ్బందులు లేక‌పోయినా అన్ నెస్స‌స‌రీ కాల్స్ ఎక్కువ అన‌గానేఅప్ప‌ట్లో మేము ఎన్ని సినిమాలు చేవామో తెలుసా అని బాల‌య్య అంటే మ‌రి ఆలోచించండి ఎన్ని న్యూస్ లు వ‌చ్చుంటాయో.. అని ప్ర‌భాస్ అన‌డం న‌వ్వులు పూయిస్తోంది. ప్ర‌మోలోనే ఈ రేంజ్ లో వుంటే డిసెంబ‌ర్ 30 న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెంత స్ట‌ఫ్ వుందో అని ఫ్యాన్స్‌, ఆడియ‌న్స్ కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య‌, ప్ర‌భాస్ ల స‌ర‌దా సంభాష‌ణ తో సాగే ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారి ట్రెండ్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News