బాయిలింగ్ స్టార్ బబ్లూ కేరక్టర్ తో స్టార్ కమెడియన్ లిస్ట్ లోకి చేరిపోయిన పృథ్వీ.. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 విషయంలో మాత్రం ఓ వివాదంలో ఇరుక్కున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో తాను నటించినా.. తన పాత్రను పూర్తిగా తొలగించడంతో.. పండగపూట అమ్మ చనిపోయింనత బాధగా ఉందని కామెంట్ చేసాడు. ఇవి ఇండస్ట్రీలో దుమారం రేపడంతో వాటిపై సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.
'మెగాస్టార్ పక్కన నిలబడ్డమే అదృష్టం.. ఆయనతో ఫోటో దిగడం ఇంకా అదృష్టం. కలిసి నటించడం అంటే ఇంకా పెద్ద అదృష్టం. ఒక వెబ్ సైట్ లో ఖైదీ 150 లో నా సీన్స్ తీసేసారు అని చూసి ఆ కథనం రాగానే కోడైరెక్టర్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను' అన్న పృథ్వీ.. సినిమా కథకు.. తన పాత్రకు సంబంధం లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందనే విషయం తెలుసుకున్నట్లు తెలిపాడు. 'మెగాస్టార్ సినిమాలో నటించడం అదృష్టం.. కనిపించకపోవడం దురదృష్టం అంతే' అన్న పృథ్వీ.. చాలా సినిమాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని.. ఆ మాత్రానికి పెద్దగా మనసులో పెట్టుకోవాల్సిన పనే ఉండదని అంటున్నాడు.
ఖైదీ నంబర్ 150 మూవీ 175 రోజులు ఆడాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో తానూ ఉంటానని చెప్పిన ఈ కమెడియన్.. చిరంజీవి సినిమా రిలీజ్ అంటే.. తాడేపల్లి గూడెంలో ఉన్నపుడు తెల్లవారు ఝాము 3 గంటల నుంచి థియేటర్ల దగ్గరే ఉండేవాడినని అన్నాడు. 150 కాకపోతే.. 151లో అయినా చిరంజీవి పక్కన కనిపించే అదృష్టం తనకు వస్తుందంటూ.. అసలు ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేశాడు.
Full View