టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులకు కూడా విపరీతమైన అభిమానం అనే సంగతి తెల్సిందే. ముఖ్యంగా కేరళలో బన్నీకి అభిమాన సంఘాలే ఉన్నాయి. ఇక ఉత్తరాదిన కూడా ఈమద్య బన్నీ పాత సినిమాలు యూట్యూబ్ లో శాటిలైట్ లో తెగ సందడి చేస్తున్నాయి. దాంతో అక్కడ కూడా బన్నీకి అభిమానులు ఏర్పడ్డారు. ఇదే సమయంలో బన్నీకి సెలబ్రెటీ అభిమానులు కూడా ఉన్న విషయం తెల్సిందే. ఆ జాబితాలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా చేరారు. కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న పునీత్ రాజ్ కుమార్ కు బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మీరు ఎవరిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని డాన్స్ చేస్తారు.. మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆర్య సమయం నుండే అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అలాగే అల్లు అర్జున్ కు కాస్ట్యూమ్స్ మరియు మూమెంట్స్ విషయమై తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందని అందుకే ఆయన అంటే అభిమానం అన్నట్లుగా పునీత్ రాజ్ కుమార్ వ్యాఖ్యలు చేశాడు. పునీత్ వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.