`బాహుబలి` తరువాత టాలీవుడ్ డైరెక్టర్ లతో పాటు హీరోల ఆలోచన తీరు మారింది. ఏ ప్రాజెక్ట్ చేసినా పాన్ ఇండియా రేంజ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంత మందేమో అంతకు మించి వుండాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మారిన మార్కెట్ ని బట్టి సినిమాలు చేయాలని, తద్వారా తమ స్థాయిని, తమ మార్కెట్ ని పెంచుకోవాలనుకుంటున్నారు.
ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లు ఇదే పంథాను అనుసరిస్తూ సెట్స్ పై వుండగా.. మరి కొన్ని రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ పై కన్నేయడం ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఏకంగా పాన్ ఇండియా ని టార్గెట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `లైగర్`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో అత్యంత భారీగా రిలీజ్ చేయబోతున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషన్ లెవెల్లో క్రేజ్ ఏర్పడింది. దీంతో పూరతి ప్లాన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తరువాత వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగనమన` ని పట్టాలెక్కించబోతున్నారు. ఈ మూవీలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే ఇంటర్నేషన్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారట.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్న పూరి జగన్నాథ్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారని తెలిసింది. ఈ భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మితో కలిసి పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నారట. ఇంతకీ ఆ ఈ ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటించబోతున్నారు? .. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ స్టోరీ ఏంటీ..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
`జనగనమన` ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేసిన పూరి జగన్నాత్ ఇదే సమయంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథని కూడా ఫినిష్ చేసేశారట. ఈ రెండు చిత్రాలని ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు? .. ఇంటర్నేషన్ ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారన్నది మరి కొన్ని రోజుల్లో పూరి టీమ్ అఫీషియల్ గా వెల్లడించనున్నట్టుగా తెలుస్తోంది.