శంక‌ర్ కే కానిది పూరి వ‌ల్ల సాధ్య‌మా?

Update: 2020-03-08 11:05 GMT
కొత్త త‌ర‌హా క‌థ‌.. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత‌ పూరి జ‌గ‌న్నాథ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో అటు హిట్లు అన్న‌వే లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ రామ్ పోతినేని (రాపో)కి.. ఇస్మార్ట్ భామ‌ల‌కు పెద్ద బ్రేక్ వ‌చ్చింది . ఈ విజ‌యం అందించిన ఉత్సాహంతో పూరి మ‌రో కొత్త ప్రాజెక్టును చేప‌ట్టారు. ఈ సారి పాన్ ఇండియా మూవీగా ఫైట‌ర్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను హీరోగా ఎంచుకుని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం ముంబ‌యిలో తాజా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న  పాన్ ఇండియా చిత్రంగా  ఫైట‌ర్‌కు ఇప్ప‌టికే క్రేజ్ వ‌చ్చింది.  పూరి- ఛార్మి బృందం క‌ర‌ణ్ జోహార్ తో టైఅప్ పెట్టుకోవ‌డం పెద్ద అస్సెట్ అన్న చ‌ర్చా సాగుతోంది. తాజాగా  ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫైట‌ర్ మూవీ బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇందులో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్సింగ్ యోధుడు మైక్ టైస‌న్ ని న‌టింప‌జేయాల‌ని పూరి టీమ్ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న‌ది ఆ వార్త సారాంశం.  దీని కోసం పూరి జ‌గ‌న్నాథ్‌- క‌ర‌ణ్ జోహార్ ఇప్ప‌టికే టైస‌న్ వ్య‌వ‌హారాలు చూసే పీఆర్ టీమ్ ని సంప్ర‌దించార‌ని తెలిసింది. టైస‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్ట‌యితే  ఫైట‌ర్ చిత్రానికి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంటుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే అది అంత సులువా? అంటే కానేకాదు..

ఇంత‌కు ముందు 2.0 చిత్రం కోసం ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్ ను తీసుకురావాల‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాడు.  అంత‌టి ద‌ర్శ‌క దిగ్గ‌జం ప్ర‌య‌త్న‌మే ఫ‌లించ‌లేదు. ఆర్నాల్డ్ ని ప్ర‌చారం కోసం తేగ‌లిగినా కానీ న‌టింప‌జేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌న్న చ‌ర్చ సాగింది. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఫైట‌ర్ చిత్ర యూనిట్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయోన‌ని సోష‌ల్ మీడియా వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. శంక‌ర్ ఫెయిల‌య్యారు.. పూరి నెగ్గుకొస్తారా? ఫైట‌ర్ చిత్రం కోసం మైక్ టైస‌న్ త‌న బిజీ షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి వ‌స్తారా ? ఇది సాధ్య‌మయ్యే ప‌నేనా ? అని నెటిజ‌నులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు పూరి టీమ్ స‌మాధానం చెబుతుందేమో చూడాలి.


Tags:    

Similar News