స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం “నిశ్శబ్ధం”. తమిళ నటుడు మాధవన్ ఈ సినిమాలో సెలెబ్రిటీ మ్యుజిషియన్ గా కనిపించనున్నాడు. కాగా అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడసన్, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభోట్ల.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తిగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న 'నిశ్శబ్ధం' మూవీ జనవరి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో సమ్మర్ కి వాయిదా పడింది. ఆ తర్వాత అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 2వ తేదీన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో పలు మూవీస్ తో పాటు ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. థియేటర్లు తెరచుకుంటే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల జాబితాలో ‘నిశ్శబ్ధం’ కూడా ఉంది. ఇటీవలే నిశ్శబ్ధంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది.
కాగా తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం స్పెషల్ గా ఓ షో వేశారని సమాచారం. అనుష్కతో పాటు చిత్ర నిర్మాతలు.. నటీనటులంతా పూరికి సన్నిహితులు కావటంతో ఆయన కొన్ని సలహాలు చెప్పాడని సమాచారం. హేమంత్ కు పూరి మంచి ఫ్రెండ్ అవడంతో 'నిశ్శబ్ధం' ట్రైలర్ కూడా పూరీ జగన్నాథ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు ఈ మధ్య బాగా వచ్చాయి. కానీ నిర్మాతలు ఈ వార్తలపై స్పందించి థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. థియేటర్స్ తెరవడంపై ప్రభుత్వాల నుంచి క్లారిటీ రాగానే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాలని చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది.