పూరి సినిమాకు బ్రేక్ వేసిన కరోనా..

Update: 2020-03-17 11:54 GMT
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా తన సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రకటించాడు. కరోనా వైరస్ మూలంగా సామాన్య ప్రజలలోనే కాదు సినీ సెలెబ్రిటీలలో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ కి బయపడి డైరెక్టర్లు - హీరోహీరోయిన్లు తమ షూటింగ్ లకు ప్యాక్ అప్ చెప్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీకి బ్రేక్ వేయక తప్పలేదు.

దేశవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సడన్ గా కోవిద్-19 మోనిటరింగ్ లో భాగంగా ఈ సినిమాను నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. అధికారికంగా ఈ సినిమాకు ఏ పేరును ప్రకటించలేదు చిత్ర యూనిట్.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ కరోనా గురించి స్పందిస్తూ.. కరోనా కుదుపు వల్ల షూటింగ్ - ప్రొడక్షన్ పనులు మొత్తం ఆపేశామని - మా చిత్రయూనిట్ మొత్తానికి సెలవులు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే షూటింగ్ డేట్ వెల్లడిస్తామని - అంతవరకు ప్రజలంతా ఆరోగ్యాలను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. దయచేసి కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, సలహాలను పాటించాలని కోరుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.


Tags:    

Similar News