టాలీవుడ్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి హాట్ హాట్ చర్చలు.. పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మాస్ రాజా రవితేజను సిట్ అధికారులు విచారించిన తీరు.. అతను చెప్పిన సమాధానాలు.. తిరిగిన అతను వేసిన ప్రశ్నలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. ఇంతలో రవితేజ గాడ్ ఫాదర్ అనదగ్గ పూరి జగన్నాథ్ మరోసారి లైన్లోకి వచ్చాడు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుంచి అందరి కంటే ముందుగా విచారణ ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ గురించి మళ్లీ ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకైన విక్రమ్ గౌడ్ ను పూరి ఓ ఆసుపత్రిలో కలుసుకున్నట్లుగా టీవీ ఛానెళ్లు రిపోర్ట్ చేశాయి. ఈ కలయికకు ప్రత్యేక కారణం ఉన్నట్లుగా ఆ ఛానెళ్లు చెబుతున్నాయి.
హైదరాబాద్ ఫిలిం నగర్లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్ గౌడ్ ను పూరి పరామర్శించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ను పరామర్శించి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడట పూరి. విక్రమ్ ను పూరి వెళ్లి పరామర్శించడంలో ఆంతర్యమేంటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ ఛానెళ్లు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం పూరికి.. విక్రమ్ కు డ్రగ్స్ కు సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారట. సిటీలో విక్రమ్ ఒక పబ్ నిర్వహించాడని.. ఈ నేపథ్యంలో పూరికి అతడికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న డ్రగ్స్ విచారణ కేసు విషయమై విక్రమ్ ఆందోళనగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. విక్రమ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో కొనసాగుతూనే సినీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతను నితిన్ హీరోగా ‘ఇష్క్.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాను కూడా నిర్మించాడు.