ఛార్మికి రాంరాం చెప్పేసినట్లున్నాడే..

Update: 2015-07-17 20:24 GMT
పూరి జగన్నాథుడికి ఇది కొత్తేమీ కాదు. గురువు రాంగోపాల్ వర్మ నుంచి మార్కెటింగ్ టెక్నిక్స్ బాగా వంటబట్టించుకున్న పూరి.. తన ప్రతి సినిమాకూ సీక్వెల్ తీసేస్తానని చెబుతుంటాడు. ఇంతకుముందు బిజినెస్ మేన్, టెంపర్ సినిమాలకు కూడా ఇలాగే సీక్వెల్ సీక్వెల్ అంటూ హంగామా చేశాడు. బాక్సాఫీస్ దగ్గర వేడి చల్లారిపోగానే ఎప్పుడూ వాటి ఊసెత్తలేదు. మొన్నామధ్య జ్యోతిలక్ష్మీ సినిమాకు కూడా ఇలాగే సీక్వెల్ అంటూ హడావుడి జరిగింది. ఇంకొన్ని రోజుల్లోనే పార్ట్-2 మొదలుపెట్టేస్తున్నట్లు భలేగా ముచ్చట్లు చెప్పారు. సినిమా విడుదలకు వారం ముందు, వారం తర్వాత పూరి, ఛార్మి కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఐతే ఎంత హంగామా చేసినా జ్యోతిలక్ష్మి వారానికి మించి థియేటర్లలో నిలవలేదు. దీంతో పూరి, ఛార్మి హడావుడి తగ్గిపోయింది. ఇప్పుడిక జ్యోతిలక్ష్మీ-2 ఊసు ఎత్తేవాళ్లే లేరు. మూణ్నాలుగేళ్ల కిందటే ఫేడవుట్ అయిపోయిన ఛార్మి.. చాలా రోజుల తర్వాత ‘జ్యోతిలక్ష్మి‘ సినిమా పుణ్యమా అని వార్తల్లో నిలిచింది. కానీ ఆ సినిమా హడావుడి తగ్గిపోగానే ఛార్మి మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు. పూరి జగన్నాథ్ కూడా జ్యోతిలక్ష్మి అయిపోగానే ఛార్మికి రాం రాం చెప్పేసినట్లున్నాడు. నితిన్ సినిమా విషయంలో కొంచెం హద్దులు దాటి మాట్లాడి వివాదానికి దారి తీయడంతో పూరి.. ఛార్మితో ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకున్నట్లు చెబుతున్నారు. జ్యోతిలక్ష్మి ఊపులో ఇంకొన్ని సినిమాలు చేసేద్దామని.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలకు లైఫ్ ఇద్దామని చూసిన ఛార్మికి ఆ ఆశలేమీ నెరవేరేట్లు కనిపించడం లేదు.
Tags:    

Similar News